రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌లో పిట్లం విజేత
సి. హెచ్. శ్రీనివాస్ స్మారక కబడ్డీ ఇన్విటేషన్ టోర్నమెంట్ విజయవంతంగా ముగింపు
పిట్లం జట్టు ప్రథమ స్థానం, గాంధారి ద్వితీయ స్థానం, తాడ్వాయి తృతీయ స్థానం
విజేతలకు రూ.20,000, రూ.10,000, రూ.5,000 నగదు బహుమతులు
కార్యక్రమంలో క్రీడా నాయకులు, కబడ్డీ సంఘ సభ్యులు పాల్గొన్నారు
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 21 కామారెడ్డి:
సి. హెచ్. శ్రీనివాస్ స్మారక రాష్ట్ర స్థాయి కబడ్డీ ఇన్విటేషన్ టోర్నమెంట్ ఉత్సాహంగా ముగిసింది. ఫైనల్ పోటీలో పిట్లం జట్టు అద్భుత ప్రతిభతో విజేతగా నిలిచింది. గాంధారి జట్టు ద్వితీయ స్థానం, తాడ్వాయి జట్టు తృతీయ స్థానం సాధించాయి.
విజేతలకు నగదు బహుమతులుగా ప్రథమ స్థానానికి రూ.20,000, ద్వితీయ స్థానానికి రూ.10,000, తృతీయ స్థానానికి రూ.5,000 అందజేశారు.
, అథ్లెటిక్స్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, పి ఆర్ టి యు తెలంగాణ,జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు, కబడ్డీ నిర్వాహకులు సి. హెచ్. రాజు, కామారెడ్డి కబడ్డీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. క్రీడాకారుల ప్రతిభను అధికారులు ప్రశంసించారు.