*కొత్త జంక్షన్ కు స్థల పరిశీలన*
*మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్*
*జమ్మికుంట ఏప్రిల్ 16 ప్రశ్న ఆయుధం*

జిల్లాలోని జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్త జంక్షన్ ల కోసం రద్దీ ఉన్న ప్రాంతాలను గుర్తించి జంక్షన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయానికి మున్సిపల్ కమిషనర్ మహ్మద్ ఆయాజ్ అధికారులతో చర్చించి ముఖ్యమైన జంక్షన్ కొత్తపల్లి జంక్షన్ అని, దీని ఏర్పాటు చేయబోతున్నట్లు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు. బుధవారం కొత్తపల్లి జంక్షన్ ఏర్పాటు స్థలాన్ని ఆయన పరిశీలించారు అనంతరం కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ ఇల్లందకుంట, ధర్మారం, కొత్తపల్లి వెళ్ళు దారిలో ఉన్న ప్రధాన కూడలి కొత్తపల్లి కూడలి (జంక్షన్) అని, ప్రజలకు ఎవరికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా జంక్షన్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఇప్పటి వరకు 15లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, మిగిలిన నిధులకై సిడిఎంఏకు లేఖ పంపినట్లు కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు. ఇల్లందకుంట సీతారామ చంద్ర స్వామి ఆలయానికి వెళ్ళే వారు, ధర్మారం వైపు వెళ్ళేవారు, కొత్తపల్లి వారికి ఎలాంటి ఇబ్బందులు వాటిల్లకుండా చూస్తామన్నారు. ఈ జంక్షన్ ను చూడగానే జమ్మికంట అభివృద్ధి తెలియాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ జి రాజిరెడ్డి, ఏఈ నరేష్, టి. పి. ఓ. శ్రీధర్, అర్ ఐ భాస్కర్ లతో పలువురు పాల్గొన్నారు.
Post Views: 9