జన వికాస సేవా సంస్థ మొక్కల పంపిణీ

*జన వికాస సేవ సంస్థ మొక్కల పంపిణీ*

*ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి*

*జమ్మికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన*

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 12*

ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జన వికాస్ జమ్మికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన అన్నారు.జన వికాస సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం జమ్మికుంట జన వికాస సెంటర్ పరిధిలోని 18 గ్రామాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా పలు రకాల పండ్ల మొక్కలు పంపిణీ చేశారు సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలను పెంచి వాటిని సంరక్షించాలని మొక్కలు పెంచడం వల్ల వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడడం మన బాధ్యత అని అన్నారు. జన వికాస సేవా సంస్థ నుండి మహిళలకు కొబ్బరి మామిడి సపోటా జామ పునాస మామిడి లాంటి ఐదు రకాల పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన, కోఆర్డినేటర్లు కే సుమలత ఏ స్వాతి సంజీవన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now