*ఘట్‌కేసర్‌లో మొక్కల నాటింపు – పర్యావరణ పరిరక్షణకు ప్రజల్లో అవగాహన పెంపుదల*
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ప్రశ్న ఆయుధం జూలై 16
100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి రాధిక గుప్తా బుధవారం ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఔషాపూర్ గ్రామంలో మొక్కలు నాటారు.
పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం నిర్వహించబడిందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, “పర్యావరణాన్ని రక్షించడం మనందరి సామూహిక బాధ్యత. ప్రతి ఇంటికి కనీసం ఒక మొక్క నాటడం ద్వారా హరిత తెలంగాణ సాధ్యమవుతుంది” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఘట్‌కేసర్ మున్సిపల్ కమిషనర్, అనురాగ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేయడంతో పాటు, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమం ప్రజల్లో పచ్చదనం పట్ల ఆసక్తిని, బాధ్యతను పెంపొందించింది.
ఘట్‌కేసర్‌లో మొక్కల నాటింపు – పర్యావరణ పరిరక్షణకు ప్రజల్లో అవగాహన పెంపుదల
by Madda Anil
Published On: July 16, 2025 7:49 pm