కెనరా బ్యాంక్ 120వ స్థాపన దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం

*కెనరా బ్యాంక్ 120వ స్థాపన దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం**

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూలై 1

కెనరా బ్యాంక్ 120వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని ఐడిఓసి ప్రాంగణంలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సి. శివ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ప్రాణవాయువును అందించే మొక్కలతో పాటు పలు రకాల పండ్ల మొక్కలను కూడా నాటారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ఎల్‌డీఎం సి. శివ ప్రసాద్‌తో పాటు జిల్లా డి.ఎస్‌.సి.డి.ఓ వినోద్ కుమార్, డి.ఆర్‌.డి.ఏ సూపరింటెండెంట్ పారిజాతం, జెడి‌ఏం దివాకర్, డిపిఎంలు, రెవెన్యూ శాఖ సిబ్బందిలో టి. సంతోష్ కుమార్, ఇతర రెవెన్యూ సిబ్బంది, స్పోర్ట్స్ శాఖ సిబ్బంది, పలు శాఖల అధికారులు, లీడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సి. శివ ప్రసాద్ మాట్లాడుతూ, “జీవకోటి మనుగడకు మొక్కలు నాటడం ఎంతో అవసరం. ఇది ప్రకృతి పరిరక్షణకు ఒక శుభప్రారంభం కావాలి” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని వారాంతం వరకు కొనసాగించే యోచనలో ఉన్నామని, దాదాపు 500 మొక్కలను వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో నాటే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment