ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమం
ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 20, కామారెడ్డి :
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో “స్వచ్ఛ హి సేవ” కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు కళాశాల ఆవరణలో ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో సుమారు ఐదు కిలోల ప్లాస్టిక్ చెత్తను సేకరించి పారిశుద్ధ్యం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కే విజయ్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ నికి విఘాతం కలిగించే ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ జి చంద్రశేఖర్ గౌడ్, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ శారద వాలంటీర్లు పాల్గొన్నారు.