Site icon PRASHNA AYUDHAM

నార్సింగిలో విద్యా పేరుతో నాటకం

Picsart 25 07 10 23 53 09 647

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"border":1,"transform":1},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false}

మెదక్/నార్సింగి, జూలై 10 (ప్రశ్న ఆయుధం):

మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలల నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల వివరాలు – పేర్లు, తరగతులు, తల్లిదండ్రుల సమాచారం – ప్రభుత్వ విద్యా పోర్టల్‌లో తప్పుల తడకగా లేదా నమోదు లేకుండా ఉండిపోయాయి.

విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లేకుండా తరగతులు నడిపిన పాఠశాలలపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర పాఠశాలలకు బదిలీ కావాలనుకునే విద్యార్థులు తమ పేర్లు పోర్టల్‌లో లేకపోవడం వల్ల అడ్మిషన్‌లో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల పేర్లు, వివరాలు తారుమారు కావడం వల్ల కొత్త పాఠశాలలు సర్టిఫికెట్లు చెల్లుబాటు అయ్యేవిగా అంగీకరించడం లేదు.

మరింతగా, ఒక పాఠశాల ప్రభుత్వం నుంచి గుర్తింపు లేకుండా విద్యా సంవత్సరం నడిపిందన్న ఆరోపణలు వెలువడ్డాయి. దీంతో తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళనతో తల్లిదండ్రులు మండల విద్యాధికారి కార్యాలయానికి చేరి ఫిర్యాదు చేస్తున్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ, నిర్లక్ష్యం చూపిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని విద్యాశాఖను కోరుతున్నారు.

Exit mobile version