సింగరేణి సామాజిక బాధ్యతలో భాగంగా
మా రోడ్డు బాగు చేయించండి సార్
ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 25 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
మణుగూరు ఏరియా జిఎం దుర్గం రాంచందర్ కి వినతి పత్రం అందజేసిన కూనవరం గిరిజనులుమణుగూరు మండల పరిధిలోని కూనవరం గ్రామం ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ పాఠశాల నుండి రేగుల గండి చెరువు వరకు రహదారి మరమ్మతులు చేయాలని కోరుతూ శనివారం సాయంత్రం మణుగూరు ఏరియా సింగరేణి జిఎం దుర్గం రాంచందర్ కి గిరిజనులు సంతకాల సేకరణతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తుడు ఏనిక బాలకృష్ణ మాట్లాడుతూ కూనవరం గ్రామానికి చెందిన గిరిజన గిరిజనేతర రైతులు తాము సాగు చేసుకుంటున్నా పంట పొలాలకు వెళ్లాలంటే రేగుల గండి రహదారిపైనే ఆధారపడాల్సి ఉందని వర్షాకాలం వస్తే పంట పొలాలను తలపించే విధంగా రోడ్డు బురదమయం కావడంతో వ్యవసాయ పనులకు వెళ్ళే రైతుల రాకపోకలకు ఇబ్బంది అవుతొందని సింగరేణి సామాజిక బాధ్యతలో భాగంగా పీకే ఓ సి ప్రభావిత గ్రామంగా కూనవరం గ్రామాన్ని గుర్తించి కూనవరం నుండి రేగుల గండి చెరువు మూల వరకు అనగా సర్వాయి గుంపు వరకు సుమారు రెండు కిలోమీటర్లు పొడవు రోడ్డు మరమ్మతులకు సింగరేణి సహకరించాలని యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఏనిక బాలకృష్ణ, సమ్మయ్య,ఏనిక కామరాజు, పెంటయ్య, ముత్తయ్య, రమేష్ వినోద్ కుమార్, మడకం రమేష్, గొర్రె ప్రశాంత్, పాయం కామరాజు, అర్జున్ రావు జెట్టిపాటి వెంకన్న, చిట్టయ్య, శేషగిరిరావు, భూషయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.