కల్కి నగర్‌లో చెత్తకుప్పలతో కాలనీవాసుల అవస్థలు
వారానికి ఒక్కసారి ట్రాక్టర్ రావడంతో పెరిగిన కోతుల బెడద
రోజూ లేదా కనీసం రెండు రోజులకు ఒక్కసారైనా చెత్త బండి పంపాలని డిమాండ్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి,ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 19
కామారెడ్డి జిల్లా కల్కి నగర్ కాలనీలో చెత్త సమస్యతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వారానికి ఒక్కసారి మాత్రమే చెత్త ట్రాక్టర్ రావడంతో కాలనీలో చెత్త పేరుకుపోతోంది. దీంతో కోతుల బెడద అధికమై, వృద్ధులు, పిల్లలు బయటకు వెళ్లాలంటే భయాందోళనకు, గురవుతున్నారని, స్కూల్ కి వెళ్ళే పిల్లలు,స్థానికులు వాపోతున్నారు. చెత్తకుప్పల వల్ల దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ప్రతిరోజూ చెత్త బండి పంపించాలని, కనీసం రెండు రోజులకు ఒక్కసారైనా చెత్త సేకరణ చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.