ప్రధాని మోదీ మాతృమూర్తి పై అసభ్యకర భాష ,దూషణలు కాంగ్రెస్ కుసంస్కారానికి నిదర్శనం
రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలి
బిజెపి నాయకుల డిమాండ్
కరీంనగర్ ఆగస్టు 30 ప్రశ్న ఆయుధం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్ లో పాల్గొన్న సభా వేదికపై నుంచి ప్రధాని మోదీ మాతృమూర్తిని దూషిస్తూ , అసభ్యకర వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ కుసంస్కారానికి నిదర్శనమని బీజేపీ నేతలు మండిపడ్డారు ప్రధాని మోదీ తల్లి పై కాంగ్రెస్ వ్యాఖ్యలను నిరసిస్తూ బిజెపి జిల్లా శాఖ కరీంనగర్ అసెంబ్లీ శాఖ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నేతలు మాజీ మేయర్ సునీల్ రావు మాజీ డిప్యూటీ మేయర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిళ్ళపు రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతూ ప్రధాని మోదీ తల్లి గురించి అసభ్యకర వ్యాఖ్యలు దూషణలతో కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాల స్థాయికి చేరుకుందని విమర్శించారు ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేస్తున్న పనికి మాలిన రాజకీయాలను చూసి దేశవ్యాప్తంగా ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వచ్చిందన్నారు మోడీ తల్లి పై రాహుల్ గాంధీ బీహార్లో నిర్వహించిన సభా వేదికగా ప్రధాని మోదీ తల్లిపై దూషణలు తలెత్తినందున ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మోడీ తల్లి పేదరికంలో నుంచి వచ్చిన విలువలు నేర్పారని, అందువల్లే మోదీ ప్రధాని స్థాయికి చేరుకున్నారన్నారు ఒక పేద తల్లి కుమారుడు 11 ఏళ్లుగా ప్రధాని పీఠంపై ఉండడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకో లేక పోతుందన్నారు మోడీ తల్లిని దూషిస్తూ , కాంగ్రెస్ నేతలు చేసిన అసభ్యకర భాషను ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని కోరారు.
కొత్తపల్లి రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం
ప్రధాని మోదీ మాతృమూర్తి పై అసభ్యకర భాష ,దూషణల పై కొత్తపల్లి బిజెపి శాఖ భగ్గుమంది రూరల్ మండల అధ్యక్షుడు కుంట తిరుపతి ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు కార్యక్రమంలో పాల్గొన్న కుంట తిరుపతి మాట్లాడుతూ ఒక పేద తల్లి కుమారుడు 11 ఏళ్లుగా ప్రధాని పీఠంపై ఉండడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందని మోడీ తల్లిని దూషిస్తూ , కాంగ్రెస్ నేతలు చేసిన అసభ్యకర భాషను ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని , రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు కడార్ల రతన్ కుమార్ , కోమటిరెడ్డి అంజన్ కుమార్ సోమినేని కరుణాకర్ బోనాల నరేష్ బైరెడ్డి వంశీ ఇల్లెందుల ఆనంద్ కట్ల శ్రీనివాస్ బోయిన మహేష్ మెరుగు మల్లేశం రాచకొండ అనిల్ విలాసగరం రామచంద్రం మల్లెం నాగరాజు బోనాల అంజన్న తదితరులతోపాటు బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు