Site icon PRASHNA AYUDHAM

పీఎం విశ్వకర్మ యోజన చేతివృత్తుల వారికి ఒక వరం

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":[],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

*గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని చేతి వృత్తుల వారికి వరం లాంటి విశ్వకర్మ యోజన*

*విశ్వకర్మ యోజన పథకం జమ్మికుంట లో విజయవంతంగా కొనసాగుతుంది*

*పథకం అమలులో రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో జమ్మికుంట ఉండడం సంతోషకరం*

*బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి*

*జమ్మికుంట నవంబర్ 5 ప్రశ్న ఆయుధం::-*

దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చేతి కుల వారికి కళాకారులకు విశ్వకర్మ యోజన పథకం గొప్పవరం లాంటిదని కరీంనగర్ బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు జమ్మికుంట పట్టణంలోని శ్రీ టెక్నాలజీ సెంటర్ బోనగిరి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశ్వకర్మ యోజన ట్రైనింగ్ సెంటర్ ను మంగళవారం రోజున స్థానిక బిజెపి శ్రేణులతో కలిసి బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి సందర్శించారు జమ్మికుంట కేంద్రంగా సుమారు 5000 మందికి వివిధ రకాల వృత్తులకు సంబంధించి ట్రైనింగ్ అందించి విశ్వకర్మ యోజన పథకాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న శ్రీ టెక్నాలజీ సెంటర్ నిర్వాహకులు శ్రీధర్ ని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అభినందించి సన్మానించారు అనంతరం జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ సాంప్రదాయ వృత్తులు చేసే చేతి వృత్తుల్లో పనిచేసే వెనుకబడిన వర్గాల కోసం బిజెపి మోడీ ప్రభుత్వం పి.ఎం విశ్వకర్మ యోజన పథకాన్ని తీసుకువచ్చిందని గురు శిష్య వారసత్వ పరంపరను ప్రోత్సహించి సాంప్రదాయ పనిముట్లను చేతులను ఉపయోగించి పనిచేసే కళాకారుల కుటుంబ ఆధారిత వృత్తులను బలోపేతం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చేతి పనులవారు కళాకారులు చేసే ఉత్పత్తుల నాణ్యతను పెంచడం వారిని దేశీయ గ్లోబల్ మార్కెట్ తో అను సాధించడం ఈ పథకం యొక్క మరొక ఉద్దేశమన్నారు. ముఖ్యంగా ఇందులో తొలత 18 సాంప్రదాయ వృత్తుల కు ఈ స్కీం ప్రయోజనాలు అందుతున్నాయని, అందులో వడ్రంగి, స్వర్ణకారులు కుమ్మరి కమ్మరి శిల్పులు, రాతి పనిచేసేవారు, చెప్పులు తయారు చేసేవారు, తాపీ మేస్త్రీలు, బుట్టలు, చాపలు, చీపిర్లు, కాళ్లు అల్లేవారు, సాంప్రదాయకంగా బొమ్మలు తయారు చేసేవారు, క్షురకులు, పూలదండలు తయారు చేసేవారు, లాండ్రీ, టైలర్, చేపల వలలు తయారు చేసేవారు, సుత్తి పనిముట్లు తయారు చేసేవారు, తాళాలు తయారు చేసేవారు ఉన్నారని తెలిపారు. ఈ వృత్తుల వారికి బేసిక్ అడ్వాన్స్డ్ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని, ట్రైన్లకు రోజువారి రూ 500ఆర్థిక సాయం అందుతుందని, పారిశ్రామిక పనిముట్ల కోసం అవసరమైన వారికి రు.15000 ఆర్థిక సాయం అందిస్తుందన్నారు అలాగే పిఎం విశ్వకర్మ సర్టిఫికెట్ తో పాటు గుర్తింపు కార్డును అందిస్తారని తొలివిడత రూపాయలు లక్ష వరకు, రెండో విడత రెండు లక్షల రుణం అందిస్తారని, దీనికి కేవలం 5% వడ్డీ వసూలు చేస్తారని వివరించారు ఇంతటి గొప్ప పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను ఆయన కోరారు. జమ్మికుంట ప్రాంత ప్రజలు ఈ పథకాన్ని సద్వినియం చేసుకొని రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండడం సంతోషకరమని ఇట్టి కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంటు విశ్వకర్మ యోజన కోఆర్డినేటర్ ఆకుల రాజేందర్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు బిజెపి పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ పల్లపు రవి ఇటికాల స్వరూప తుడి రవిచంద్ర రెడ్డి బచ్చు శివకుమార్ మోడం రాజు రావుల శ్రీనివాస్ కొండ్లె నాగేష్ బూరుగుపల్లి రామ్ గర్రెపల్లి నిరుపా రాణి పొన్నగంటి రవి ముకుందం సుధాకర్ ఉడుగుల మహేందర్, కొండపర్తి ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు

Exit mobile version