Site icon PRASHNA AYUDHAM

రేకుర్తిలో పోచమ్మ తల్లి బోనాల వేడుకలు

IMG 20250622 WA2056

*రేకుర్తిలో పోచమ్మ తల్లి బోనాల వేడుకలు*

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామంలో వెలసిన పోచమ్మ తల్లి ఆలయంలో బోనాల ఉత్సవం ఆదివారం రోజున వైభవంగా నిర్వహించబడింది.

ఆరుద్ర కార్తి ప్రారంభాన్ని పురస్కరించుకుని, గ్రామంలోని పాతవాడ, కొత్తవాడ నేతకాని వంశస్తులు ప్రతి ఇంటి నుండి బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి సమర్పించారు. మహిళలు, పిల్లలు, కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించారు.

బోనాల సందర్భంగా కోడి పిల్లలను బలిచ్చి, కొబ్బరికాయలు కొట్టి, అమ్మవారిని ప్రార్థించారు. రేకుర్తి గ్రామం నేతకాని వంశస్థులకు పుట్టినిల్లు. తాత ముత్తాతల కాలం నుండి అనుసరించబడుతున్న సంప్రదాయంగా ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోంది.

బోనాల కార్యక్రమంలో నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం మారుతి పాల్గొని, రేకుర్తి గ్రామానికి పూర్వ వైభవం తీసుకురావడానికి సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. పోచమ్మ తల్లి రక్షణ ఆశిస్తూ దుష్టశక్తుల నాశనం కోసం ప్రార్థనలు చేశారు.

ఈ వేడుకలో బండారి లక్ష్మిరాజన్, ఎం.లక్ష్మీరాజం, దుర్గం అంజయ్య, గోలే కిష్టయ్య, దుర్గం శంకర్, గోలే రామచంద్రం, బండారి చంద్రయ్య, జాడి బాలారెడ్డి, గోల్లే మారుతి (SU), గోల్లే శ్రీనివాస్, కామెరా నరసయ్య, జి.విష్ణు, దుర్గం శ్యాంసుందర్, జె.అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఇంటి నుండి మహిళలు, పిల్లలు భాగస్వాములై అమ్మవారికి మొక్కులు చెల్లించారు.

Exit mobile version