Site icon PRASHNA AYUDHAM

ఫాంహౌస్‌ కోడిపందేల కేసులో పోలీసుల విచారణకు హాజరైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

IMG 20250314 WA0029

*ఫాంహౌస్‌ కోడిపందేల కేసులో పోలీసుల విచారణకు హాజరైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి*

ఫిబ్రవరి 11న తోల్కట్ట గ్రామ పరిధిలోని పోచంపల్లి ఫాంహౌస్‌పై పోలీసుల దాడి

కోడిపందేలు ఆడుతున్న వారితో పాటు 64 మందిని అరెస్టు చేసిన పోలీసులు

లీజు డాక్యుమెంట్లపై అనుమానాలు రావడంతో పోచంపల్లికి నోటీసులు

మొయినాబాద్ ఫాంహౌస్‌లో కోడిపందేల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. మొయినాబాద్ పోలీసులు ఆయనను విచారించారు. గత నెల 11వ తేదీన తోల్కట్ట గ్రామ పరిధిలోని శ్రీనివాస్ రెడ్డి ఫాంహౌస్‌పై ఎస్వోటీ, మొయినాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోడి పందేలు ఆడుతున్న వారితో పాటు 64 మందిని అదుపులోకి తీసుకున్నారు.

పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు ఇదివరకు నోటీసులు ఇచ్చారు. తన ఫాంహౌస్‌ను లీజుకు ఇచ్చానని పోలీసుల విచారణలో ఆయన తెలిపారు. లీజుకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా పోలీసులకు అందజేశారు.

అయితే, లీజు డాక్యుమెంట్లపై అనుమానాలు రావడంతో పోలీసులు ఆయనకు రెండోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన విచారణకు హాజరయ్యారు.

Exit mobile version