*వీరఘట్టంలో కిరాతక ప్రిన్సిపల్ పై పోక్సో కేసు నమోదు*
వీరఘట్టం :
మన్యం జిల్లా పాలకొండ నియోజక వర్గంలో వీరఘట్టం మండలం నడుకూరు సమీపం లో ఉన్న గురుబ్రహ్మ పాఠశాల ప్రిన్సిపల్ తెర్లి సింహాచలం పై శుక్రవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి కళాధర్ తెలిపారు. పాఠశాలలో చదువుతున్న 4, 5,6వ తరగతి బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.