పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి.

*పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి.

 

గిరిజన భూముల జోలికొస్తే సహించేది లేదు..

 

*లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు ట్రైకార్ చైర్మన్ డాక్టర్ బేల్లయ్య నాయక్

 

మేమెంతో మాకు అంత వాటా కావాలి…

 

రాష్ట్ర అధ్యక్షులు లంబాడి హక్కుల పోరాట సమితి పిలుపు..మూడవత్ రాంబల్ నాయక్

 

కామారెడ్డి జిల్లా గాంధారి

(ప్రశ్న ఆయుధం) జులై 27

 

గాంధారి మండల కేంద్రంలో మారుతి ఫంక్షన్ హాల్ లో లంబాడి హక్కుల పోరాట సమితి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మోతిలాల్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో లంబాడి హక్కుల పోరాట సమితి  ఆధ్వర్యంలో జరిగిన సభలో డా,, తేజావత్ బెల్లయ్య నాయక్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ట్రైకార్  చైర్మెన్, మూడవత్ రాంబల్ నాయక్ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర  ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు మాట్లాడుతూ లంబాడి హక్కుల పోరాట సమితి 1997 జూలై 1న ఆవిర్భవించింది. ఒక లక్ష్యం సిద్ధాంతం కోసం మా తండాలో మా రాజ్యం గ్రామాలకు దూరంగా ఉన్న తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని లక్ష్యంతో మేమెంత మందిమో మాకంతా వాటా  కావాలనే నినాదంతో డా , తేజావత్ బెల్లయ్య నాయక్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గారి నాయకత్వంలో ఆవిర్భవించిన  లంబాడి (నంగార భేరి) లంబాడి హక్కుల పోరాట సమితి సంఘం తమ పోరాట ఫలితంగా గత కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 3000 వేలకు పైగా నూతన గిరిజన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకొని మా తండాలో మా రాజ్యం లక్ష్యాన్ని సాధించింది.

మేమెంత మందిమో  మాకంత  వాటా కావాలని, జనాభా ప్రకారం గిరిజనులకు రిజర్వేషన్లను 10 శాతానికి గత ప్రభుత్వంలో పెంచేల చేసుకున్నాం. ఇది లంబాడి హక్కుల పోరాట సమితి, విజయం అదేవిధంగా లంబాడీల భాష గోర్ బోలి,ని భారత రాజ్యాంగం లోని 8 వ షెడ్యూల్లో చేర్చడం కోసం లంబాడి హక్కుల పోరాట సమితి పోరాటం చేస్తుందని తెలియజేయడం జరిగింది.

Join WhatsApp

Join Now