తిమ్మాపూర్ లో విజృంభిస్తున్న విష జ్వరాలు..!
రెండు నెలల్లోనే 150కి పైగా జ్వరాలు, డెంగ్యూ కేసులు..!
ఒకే కుటుంబంలో ముగ్గురికి, నలుగురికి చొప్పున జ్వరాలు..!
పారిశుద్ధ్యంపై స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో రామిరెడ్డి వైఫల్యం..!
హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న గ్రామ ప్రజలు, వేలకు వేలు ఖర్చులు
ఉన్నతాధికారుల జోక్యం కోరుతున్న గ్రామస్థులు
ప్రశ్న ఆయుధం ఆగష్టు 23 జగదాపూర్ మండలం, తిమ్మాపూర్:గ్రామం మొత్తం విష జ్వరాలు చాపకిందనీరులావిస్తరిస్తున్నాయి. రెండు నెలల్లోనే 150 మందికిపైగా జ్వరాలు, డెంగ్యూ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకే ఇంట్లో ముగ్గురికి, నలుగురికి వరుసగా జ్వరాలు రావడంతో ప్రజలు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ విసిగిపోయారు.ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం వేలకు వేలు రూపాయలు వసూలు చేస్తుండడంతో పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ పరిస్థితికి కారణం గ్రామంలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగకపోవడమేనని ప్రజలు ఆరోపిస్తున్నారు.స్పెషల్ ఆఫీసర్‌గా నియమితులైన ఎంపీడీవో రామిరెడ్డి పేరు మాత్రమే ఉన్నా, పనిలో మాత్రం వైఫల్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయనతో పాటు గ్రామ కార్యదర్శి కూడా హాజరు రాసుకోవడానికే వస్తున్నారని గ్రామస్థులు విమర్శిస్తున్నారు.
“ఇప్పటికైనా ఉన్నతాధికారులు గ్రామానికి వచ్చి సమస్యలపై దృష్టి సారించి పరిష్కారం చూపాలి” అని తిమ్మాపూర్ ప్రజలు వేడుకుంటున్నారు.
–ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పోసాన్ పల్లి రాజు..
తిమ్మాపూర్ గ్రామం మొత్తం విష జ్వరాల కాటకు తల్లడిల్లుతుంటే, అధికారులు మాత్రం నిర్లక్ష్య ధోరణి కొనసాగిస్తున్నారు. రెండు నెలలుగా 150 మందికిపైగా జ్వరాలు, డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. వర్షాకాలంలో వర్షపు నీరు రోడ్లపై, కాలువల్లో ఆగి ఉండడంతో జ్వరాలు మరింతగా వ్యాపిస్తున్నాయని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పోసాన్ పల్లి రాజు తీవ్రంగా స్పందించారు. “గ్రామానికి స్పెషల్ ఆఫీసర్‌గా ఎంపీడీవో రామిరెడ్డి ఉన్నా, పారిశుద్ధ్యంపై ఎలాంటి శ్రద్ధ చూపడం లేదు. ఆయనతో పాటు గ్రామ కార్యదర్శి కూడా హాజరు వేసుకోవడానికే వస్తున్నారు. సమస్యను పట్టించుకోవడం లేదు. వారి నిర్లక్ష్యమే ఈ జ్వరాలకు మూల కారణం” అని ఆరోపించారు.తిగుల్ పీహెచ్‌సీ వైద్యులు కూడా నామమాత్రంగా హెల్త్ క్యాంప్‌లు పెడుతున్నారని, సరైన వైద్యం అందించడం లేదని మండిపడ్డారు.
“జిల్లా కలెక్టర్ వెంటనే గ్రామాన్ని సందర్శించి, విజృంభిస్తున్న విష జ్వరాలను నియంత్రించడంలో విఫలమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని పోసాన్ పల్లి రాజు డిమాండ్ చేశారు.
-తలకొక్కుల శ్రీశైలం-
వారం రోజులపాటు ప్రత్యేక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలివిష జ్వరాలతో గ్రామంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు గ్రామంలో వారం రోజులపాటు ప్రత్యేక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నాం భయంతో ప్రైవేట్ హాస్పిటల్స్ వెళితే ఒక్కొక్కరికి లక్షలలో ఖర్చు అవుతుందని తెలిపారు గ్రామంలోని ప్రత్యేక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నాం
-కొంతం లక్ష్మయ్య-
వ్యవసాయం కోసం దాచిన పైసలు హాస్పిటల్ పాలవుతున్నాయిఈ వర్షాకాలంలో వ్యవసాయం కోసం కష్టపడి కొంత దాచిన డబ్బులు గ్రామంలో వస్తున్న విష జ్వరాల వల్ల హాస్పటల్లో ఖర్చవుతున్నాయి డబ్బులు లేక ఇటు హాస్పిటల్స్ చూపించుకోలేక అటు వ్యవసాయం చేయలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది అన్నారు ప్రభుత్వం అధికారులు ఈ విష జ్వరాలు బారి నుండి రక్షించాలని కోరారు
-మనోజ్ బిజెపి నేత-
ఆరు నెలల్లో దోమల మందు ఒక్కసారి కూడా స్ప్రే చేయలేదుగత రెండు నెలలుగా తిమ్మాపూర్ గ్రామంలో విష జ్వరాలతోటి గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే గ్రామపంచాయతీ నుండి కనీసం దోమల మందును గ్రామంలోని రోడ్లమీద మురికి వాడల మీద గత ఆరు నెలల నుంచి ఒక్కసారి కూడా స్ప్రే చేయకపోవడం వల్లనే ఈ విషజరాలు విజృంభించాయి గ్రామ సెక్రెటరీ మరియు స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారు అర్థమవుతలేదు అన్నారు కనీస చర్యల్ని తీసుకోకపోవడం వల్లే విజృంభిస్తున్నాయి బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న అధికారులను మా గ్రామం నుంచి తొలగించాలి