తాడువాయిలో పేకాట – ఇద్దరు అరెస్ట్
కామారెడ్డి జిల్లా తాడ్వాయి
(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 9
తాడువాయి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. శనివారం రోజున మధ్యాహ్నం 3 గంటల సమయంలో దేమిరోడ్ సమీపంలో చెట్టు కింద పేకాట ఆడుతున్న ధర్మయోల రాములు, జంగల్ దేమి నవీన్ (ఇద్దరూ తాడువాయి గ్రామ నివాసులు)ను ఎస్‌ఐ టీ. మురళి నేతృత్వంలోని పోలీసు బృందం అదుపులోకి తీసుకుంది.
వారి వద్ద నుండి రూ.1,700 నగదు మరియు రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.