నూతన ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షునిగా పోల విట్టల్ రావు గుప్తా నియామకం.
(ప్రశ్న ఆయుధం )డిసెంబర్ 27.
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘానికి నూతన అధ్యక్షుడిగా పోల విట్టల్ రావు గుప్తా, ప్రధాన కార్యదర్శి చిదుర ప్రదీప్, కోశాధికారి నీల భాస్కర్ ,గౌరవ అధ్యక్షులు బచ్చు అంజయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. నూతన కార్యవర్గానికి హైదరాబాదులో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా జిల్లా నూతన కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు సభ్యులకు ఘనంగా సన్మానించి అభినందించారు.అనంతరం నియామక పత్రాలు అందజేశారు. ఈ సన్మాన కార్యక్రమం సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా మాట్లాడుతూ… నూతనంగా ఎన్నికైన నిజామాబాదు జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం చాలా అభినందనీయమని పేర్కొన్నారు . నూతన కార్యవర్గం ఆర్యవైష్యుల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహాసభ ఉపాధ్యక్షుడు ఆగిరి వెంకటేష్, కార్యవర్గ సభ్యులు పోల సుధాకర్, జిల్లా ప్రస్తుత అధ్యక్షులు మోటూరి మురళి, బచ్చు పురుషోత్తం మాశెట్టి ఆదిత్య గుప్తా తదితరులు పాల్గొన్నారు.