Headlines :
-
పోలవరం ప్రాజెక్టు ఎత్తు వివాదం: పునరావాసంలో ఎసరు
-
కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు
-
గిరిజనుల పునరావాసంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అన్యాయం
-
టిడిపి-వైసిపి ఆరోపణల మధ్య రాజకీయ గందరగోళం
-
ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు – ఎవరి అనుమతి?
కేంద్రం ఆదేశాలే అమలు
టిడిపి కూటమి, వైసిపి సర్కారుల తీరిదే
నిర్వాసితులకు తీరని ద్రోహం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో సర్వస్వాన్ని కోల్పోతున్న నిర్వాసితులకు మొదటి నుండి అన్యాయమే జరుగుతోంది. తాజాగా ప్రాజెక్టు ఎత్తు విషయం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుకు పరిమితం చేయడానికి అంగీకరించి ఆ మేరకు 12,250 కోట్ల రూపాయలను టిడిపి కూటమి ప్రభుత్వం తీసుకుం దని, ఫలితంగా రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగు తోందని వైసిపి ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను తిప్పికొట్టడానికి టిడిపి కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టును తొలుత నిర్దేశించిన విధంగా 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మిస్తే పెద్ద ఎత్తున భూభాగం ముంపునకు గురవుతుంది. నిర్వాసితుల సంఖ్య భారీగా పెరుగుతుంది. పునరా వాసం కోసం అధికమొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పునరా వాసంతో సహా ప్రాజెక్టు నిర్మాణానికయ్యే పూర్తి ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరించాల్సిఉందన్న సంగతి తెలిసిందే. అయితే, మొదటి నుండి కేంద్రం దీన్ని తిర స్కరిస్తూనేఉంది. పట్టుబటి పునరావాసానికి నిధులు సాధించాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు దానికి భిన్నంగా వ్యవహరిస్తు న్నాయి. కేంద్రం ఇచ్చిందే చాలన్నట్లుగా తలలూపు తున్నాయి. ఈ క్రమంలోనే నిర్వాసితుల సంఖ్యను పునరావాసం ఖర్చును తగ్గించి చూపే వ్యూహంలో భాగంగానే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు అంశం ముందుకు వచ్చింది. అదీ ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. కేంద్రం ఆదేశాలను ప్రశ్నించలేని రాష్ట్ర ప్రభుత్వాల నిస్సహాయతే ఈ పరిస్థితికి కారణం. అయితే, అసలు వాస్తవం ఏమిటంటే ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం చేసినా ముంపు మాత్రం 45 కాంటూరు వరకు ఉంటోంది. కొన్నేళ్లుగా గోదావరికి వస్తున్న వరదతో ఆ మేరకు గిరిజన అవాసాలు మునిగి పోతున్నాయి. నిర్వాసితులుగా మారుతున్నారు. గుట్టలు, కొండలెక్కి ప్రాణాలను కాపాడుకుంటు న్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, వీరందరికి పునరావాసం కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు కారణాలు ఏవైనా గిరిజనులకు ద్రోహం చేస్తున్నాయన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది.
ఏం జరిగింది…?
పునరావాసం కోసం సుమారు రూ.33 వేల కోట్ల అవసరం ఉంటుందని 2014-2019 మధ్య టిడిపి ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఆ నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి చేయడంకానీ, పునరావాసం పనులు చేపట్డడం కానీ చేయలేదు.డయాఫ్రం వాల్ , క్రస్ట్ గేట్ల నిర్మాణం వంటి పనులను చేపట్టింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీ సూచన మేరకు ప్రాజెక్టును రెండు దశల్లో నిర్మిస్తామని, మొదటి దశలో 41.15 మీటర్ల ఎత్తుకు, రెండవ దశలో 45.72 మీటర్ల పూర్తిఎత్తుకు నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొంది. ఇదే అంశాన్ని కేంద్రానికి కూడా ప్రతిపాదించిందని టిడిపి ప్రస్తుతం ఆరోపిస్తోంది. తాజాగా కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనల మేరకే నిధులు విడుదల చేశారన్నది టిడిపి వాదన! ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు కుదించడానికి టిడిపి కూటమి ప్రభుత్వం ఒప్పుకుందని, ఫలితంగా ప్రాజెక్టు బ్యారేజి స్థాయికి పరిమితమవుతుందని, సంవత్సరంలో వంద రోజులు మాత్రమే నీటిని నిలువ ఉంచడం సాధ్యమవుతుందని ఫలితంగా రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని వైసిపి విమర్శిస్తోంది, అయితే, తమ హయంలో ఏం జరిగిందన్న విషయాన్ని వైసిపి నాయకులు చెప్పడం లేదు. ఈ ఆరోపణల్లోనూ గిరిజనులను, వారికి కలుగుతున్న కష్టాన్ని రెండు పక్షాలు విస్మరిస్తున్నాయి.
45.72 మీటర్లకే నిర్మిస్తాం.. తొలిదశలో 41.15 మీటర్లే : మంత్రి నిమ్మల
పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో తాము రాజీ పడటం లేదని 45.72 మీటర్ల ఎత్తు నిర్మిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం సాయంత్రం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు . గత ప్రభుత్వమే రెండు దశలను ప్రతిపాదించిందని, దానితో తమకు ఎటువంటి ప్రవేయం లేదని ఆయన చెప్పారు. అప్పట్లో కోరిన మేరకు రూ.12,250 కోట్లు ఇటీవలే అందాయని తెలిపారు. ఆ మేరకు తొలిదశలో 41.15 మీటర్ల ఎత్తుకే నీరు నిల్వ చేస్తామని , రెండవ దశలో పూర్తిస్థాయి ఎత్తుకు చేరుస్తామని చెప్పారు.
అంగుళం తగ్గించినా ఊరుకోం.. : మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
పోలవరం ఎత్తును అంగుళం తగ్గించినా ఊరుకునేది లేదని మాజీ మంత్రి, వైసిపి నాయకులు కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ నిర్ణయానికి చంద్రబాబు మూల్యం చెల్లించుకోకతప్పదని అన్నారు. డెల్టా రైతుల పక్షాన వైసిసి నిలబడి పోరాటం చేస్తుందని చెప్పారు. రైతుల బీమాకు సంబంధించి ప్రీమియం ఎగ్గొట్టడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.