Site icon PRASHNA AYUDHAM

ఓపెన్ ప్లాట్ లో బండరాళ్లను బ్లాస్టింగ్ చేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు 

IMG 20250704 WA0422

ఓపెన్ ప్లాట్ లో బండరాళ్లను బ్లాస్టింగ్ చేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 4

 

 

తేదీ: 03-07-2025 గురువారం రోజున నమ్మదగిన సమాచారం ఏమనగా Frobels స్కూల్ వెనకాల KPR కాలనీ నందు గల ఒక ఓపెన్ ప్లాట్ లో గల బండరాళ్ళను తొలగించడానికి ముగ్గురు వ్యక్తులు జలటన్ స్టిక్స్, డిటోనేటర్ మరియు కార్డెక్స్ వైర్లను ఉపయోగించి, అట్టి బండరాళ్ళను బ్లాస్టింగ్ చేస్తున్నారని సమాచారం రాగా వెంటనే జిల్లా SP ఆదేశానుసారంగా, ASP కామారెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో కామారెడ్డి పట్టణ ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బందితో కలిసి KPR కాలనీ కి వెళ్లినారు. ముగ్గురు వ్యక్తులు శ్రీధర్ అనే వ్యక్తి యొక్క ఓపెన్ ప్లాట్ లో ఉన్న బండరాళ్ళను తొలగించడానికి బండరాళ్ళకు డ్రిల్లింగ్ చేసి అందులో జలటన్ స్టిక్స్ అమర్చి దానికి అనుసంధానంగా జలటిన్ స్టిక్స్, డీటోనేటర్ వైర్, కార్డేక్స్ వైరు సహాయంతో బ్యాటరీ ద్వారా పేల్చడానికి సిద్ధంగా ఉంచినారు. అట్టి ముగ్గురు వ్యక్తులను పట్టుకొని విచారించగా వారు ప్లాట్లో ఉన్న బండరాళ్లను జలటిన్ స్టిక్స్, డిటోనేటర్, కార్డేక్స్ వైరు ఉపయోగించి పగలగొట్టడానికి ఎలాంటి ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా అట్టి ప్లాటు ఇండ్ల మధ్యలో ఉందని తెలిసి పక్కనే ఫ్రొబెల్స్ స్కూల్ పిల్లలు, చుట్టుపక్కల నివాస గృహాలలోని ప్రజల ప్రాణాలకు హాని మరియు ఆస్తి నష్టం జరగవచ్చని తెలిసి కూడా బండరాళ్ళను పేల్చేయడానికి ప్రయత్నిoచినారు. అందుకు గాను అట్టి ప్లాట్ యజమాని అయిన శ్రీధర్ దగ్గర 50,000/-రూ.లకు మాట్లాడుకుని 5000/- రూ.లు అడ్వాన్సుగా తీసుకున్నారు. వారు వాడిన జలటిన్ స్టిక్స్, డిటోనేటర్, కార్డేక్స్ వైరు లింగాపూర్ గ్రామ శివారులోని లోని శ్రీవారి Eco Township (Vibhoos Elite Township) వెంచర్ దగ్గర నుండి తెచ్చారు. తదుపరి విచారణలో శ్రీవారి Eco Township (Vibhoos Elite Township) వెంచర్లోని రాళ్ళను తొలగించడానికి శంకర్ మరియు స్వామిల ద్వారా ఈ పేలుడు పదార్థాలు తెప్పించి వెంచర్లోని రేకుల షెడ్డులో అధిక మొత్తంలో జలటిన్ స్టిక్స్, డిటోనేటర్, కార్డేక్స్ వైరు ఉంచినారు. ఇన్స్పెక్టర్ గారు లింగాపూర్ గ్రామ శివారులోని శ్రీవారి Eco Township (Vibhoos Elite Township) వెంచర్ లోని రేకుల షెడ్డులో ఎటువంటి ప్రబుత్వ అనుమతి లేకుండా, అక్రమంగా నిల్వ ఉంచిన జలటన్ స్టిక్స్, డిటోనేటర్ మరియు కార్డెక్స్ వైర్లు ఉండగా స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న వాటి వివరములు:

1. జలటన్ స్టిక్స్-1564 2.డిటోనేటర్స్-41, 3.కార్డెక్స్ వైర్లు బండల్స్ -16( సుమారు 4300 మీటర్లు )

4. ఒక బ్యాటరీ, 5. ఒక చెక్ మీటర్ 6. రెండు బజాజ్ ప్లాటిన మోటార్ సైకిళ్ళు 7. నాలుగు సెల్ ఫోన్ లు

నిందితుల పూర్తి వివరాలు:-

1) బొంత సంపత్ s/o వెంకటేష్, వయసు:26 సంవత్సరాలు, కులం:వడ్డెర, వృత్తి: రాయికొట్టుడు, r/o పరడా గ్రామం, కట్టంగూర్ మండలం, నల్గొండ జిల్లా, ప్రస్తుత నివాసం: శ్రీనివాస నగర్ కాలనీ, కామారెడ్డి జిల్లా.

2) బొంత లక్ష్మీనారాయణ s/o అయోధ్య, వయసు: 34 సంవత్సరాలు, కులం: వడ్డెర, వృత్తి: లేబర్, R/o పరడా గ్రామం, కట్టంగూర్ మండలం, నల్గొండ జిల్లా, ప్రస్తుత నివాసం: థిస్ మండలి దగ్గర, అశోక్ నగర్ కామారెడ్డి.

3) బొంత రాజు s/o యాదయ్య, వయసు: 37 సం. కులం: వడ్డెర, వృత్తి: కులవృత్తి, r/o మెడికల్ కాలేజీ రోడ్డు, వార్డ్ నెంబర్ 35, దేవునిపల్లి కామారెడ్డి.

4) చింతల శ్రీధర్, S/o బస్వయ్య, వయసు: 37 సం. కులం:వైశ్య, వృత్తి: బట్టల వ్యాపారం, r/o PMH కాలనీ, కామారెడ్డి.ఇట్టి కేసులో చకచక్యముగా వ్యవహరించి పెద్దమొత్తములో జలటన్ స్టిక్స్, డిటోనేటర్ మరియు కార్డెక్స్ వైర్లు గుర్తించి స్వాధీనం చేసుకొనుటలో మరియు నిందితులను గుర్తించి అందులోని (4) గురిని అరెస్ట్ చేయుటలో కీలకముగా వ్యవహరించిన కామారెడ్డి పట్టణ ఇన్స్పెక్టర్, SI శ్రీరామ్, కానిస్టేబుల్స్ నరేష్, రవి, విశ్వనాథ్, అనిల్, వినయ్, సంపత్, నర్సారెడ్డి లకు జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర, IPS అభినందించడం జరిగింది.

ముందస్తు పర్మిషన్లు లేకుండా ఎవరుకూడ ప్రజల ప్రాణాలకు హాని కలిగించే లేదా ఆస్తులకు నష్టం చేకూర్చే పేలుడు పదార్థాలను కలిగి ఉండరాదని ఈ సంధర్బంగా కామారెడ్డి ప్రజలకు జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర, IPS తెలియజేశారు. ఇలాంటి పేలుడు పదార్థాలు రవాణా చేసిన, నిల్వ చేసిన, కలిగి ఉన్న నేరముగా పరిగణించబడును..

Exit mobile version