చైనా మాంజాలపై పోలీసుల దాడి

చైనా మాంజాలపై పోలీసుల దాడి

– రూ.1,19,700 విలువైన 2006 చైనా మాంజా బండల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.

*సిద్దిపేట, జనవరి 06

IMG 20250106 WA0073

నిషేధించిన చైనా మాంజాలను (267 చైనా మాంజా బండల్స్) రూ.1,19,700 విలువైన మాంజాలను సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ది మురళి బాలాజీ బుక్ డిపో సిద్దిపేట పట్టణం అతని పాత ఇల్లు పారుపల్లి స్ట్రీట్ లో ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా కలిగి ఉన్నాడని మరియు రహస్యంగా అమ్ముతున్నాడని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లి పాత ఇంటిలో తనిఖీలు చేసి 267 చైనా మాంజా బండల్స్, రూ.1,19,700 వి డబ్బు స్లగలవి స్వాధీనం చేసుకుని సిద్దిపేట టూ టౌన్ పోలీసులకు అప్పగించడం జరిగింది ఏడు నెలల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఎంఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు, మాట్లాడుతూ గ్రామాలలో, పట్టణాలలో ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాను ఎవరైనా కలిగి ఉన్నా ఇతరులకు అమ్మిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నైలాల్‌, నింథటిక్‌ దారాలతో తయారు చేసే ఈ చైనా మాంజాలతో మనుషులతో పాటు ఎగిరే పక్షులకు ప్రమాదకరం రోడ్లపై మోటార్ సైకిల్ తో వెళ్లే వారికి కూడా అది చూడకుండా మెడకు కాళ్లకు తట్టుకొని చనిపోయిన సంఘటనలు కూడా జరిగాయి. మరియు పర్యవరణానికి విపత్తుగా కావడంతో జాతీయ హరిత ట్రిబ్యూనల్‌ ఆదేశాలను మేరకు చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది.ఏవరైన చైనా మాంజా విక్రయిస్తున్న, కలిగి ఉన్న, సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.

Join WhatsApp

Join Now