పేకాటపై పోలీసుల దాడి – ఐదుగురు అరెస్ట్‌

పేకాటపై పోలీసుల దాడి – ఐదుగురు అరెస్ట్‌

రూ.7,950 నగదు – ఐదు సెల్‌ఫోన్లు సీజ్‌

కామారెడ్డి జిల్లా తాడ్వాయి,
(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 8

బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురిని తాడ్వాయి పోలీసులు పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే… పెద్దమ్మగుడి ప్రక్కన ఖాళీ ప్రదేశంలో కొంతమంది పేకాట ఆడుతున్నారనే సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని దాడి నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ పేకాట ఆడుతున్న మరాఠీ నారాయణ, చాకలి రాజయ్య, చిట్టపు నాగయ్య, సద్దెన నారాయణ, మరాఠీ కిష్టయ్య,లను అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి రూ.7,950 నగదు, మరియు ఐదు సెల్‌ఫోన్లను, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ ఐ, టి. మురళి తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment