కామారెడ్డి బస్టాండ్‌లో ప్రజలకు సైబర్ నేరలపై పోలీసుల అవగాహనా 

కామారెడ్డి బస్టాండ్‌లో ప్రజలకు సైబర్ నేరలపై పోలీసుల అవగాహనా

ప్రశ్న ఆయుధం

కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ డిసెంబర్‌ 22:

కామారెడ్డి జిల్లా బస్టాండ్ ఆవరణలో సోమవారం ఉదయం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు, కామారెడ్డి జిల్లా పోలీసు కళాబృందం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. “పైసా పైలం – సైబర్ ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” అనే నినాదంతో ప్రయాణికులకు సైబర్ మోసాలపై స్పష్టమైన అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా పీసీ ప్రవీణ్ మాట్లాడుతూ, సైబర్ నేరాల బారిన పడితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కి సమాచారం ఇవ్వాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేయాలని తెలిపారు. అలాగే సెల్‌ఫోన్లు, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై షీ టీమ్ సేవల గురించి పీసీ భూమయ్య అవగాహన కల్పించారు. మహిళలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు షీ టీమ్ సెల్ నంబర్ 8712686094కు సంప్రదించాలని తెలిపారు. పోలీస్ కళాబృందం ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్‌లు, పీసీలు ప్రభాకర్, సాయిలు మాటలు, పాటల రూపంలో సైబర్ నేరాలపై సందేశాలు అందించారు. ఈ కార్యక్రమంలో పీసీ సుల్తానా కూడా పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment