మాదకద్రవ్యాలు–సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లాఇంచార్జ్ నవంబర్ 18
కామారెడ్డి జిల్లాలోని నసురుల్లాబాద్ మండలంలోని నెమ్లి ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం యువతలో పెరుగుతున్న మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ M. రాజేష్ చంద్ర IPS ఆదేశాల మేరకు, పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది. నసురుల్లాబాద్ సబ్‌ఇన్స్పెక్టర్ S. రాఘవేందర్ సూచనలతో విద్యార్థులకు విభిన్న అంశాలపై వివరించడం జరిగింది.
కార్యక్రమంలో షీ టీమ్స్ సభ్యులు PC అనిల్, WPC ప్రియాంక పాల్గొని విద్యార్థులకు సైబర్ భద్రతపై సూచనలు అందించారు.
సందేహాస్పద పరిస్థితుల్లో సైబర్ నేరాల టోల్ ఫ్రీ – 1930, అత్యవసర సేవలకు Dial 100, షీ టీమ్స్ టోల్ ఫ్రీ నెంబర్ – 8712686094 ను వినియోగించాలన్నారు.
యువతలో పెరుగుతున్న డ్రగ్స్, గంజాయి, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలపై హెచ్చరికలు జారీ చేశారు. అలాగే మహిళలు–పిల్లలపై జరిగే హింస, లైంగిక నేరాలు, బాల్య వివాహాలు, సోషల్ మీడియా వేదికలైన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని అవగాహన కల్పించారు.
పోలీస్ కళాబృందం ఇన్‌చార్జ్ హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, U. శేషరావు, PC సాయిలు పాటలు, మాటల రూపంలో విద్యార్థులకు అర్థమయ్యేలా చక్కగా వివరించడంతో కార్యక్రమం మరింత ఆకర్షణీయంగా సాగింది.
కార్యక్రమంలో హెడ్ మాస్టర్ దుర్గాబాయ్, ASI గంగారం, PC శ్రీధర్, HG గౌరీ, స్టాఫ్ సభ్యులు, SB PC గంగారం పాల్గొన్నారు.