కృష్ణాజీవాడి హైస్కూల్‌లో విద్యార్థులకు సామాజిక అంశాలపై పోలీసుల అవగాహన 

కృష్ణాజీవాడి హైస్కూల్‌లో విద్యార్థులకు సామాజిక అంశాలపై పోలీసుల అవగాహన

 

 

ప్రశ్న ఆయుధం

 

కామారెడ్డి జిల్లా నవంబర్ 27

 

కామారెడ్డి జిల్లా పరిధిలోని కృష్ణాజీవాడి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం రోజున కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బాల్యవివాహాలు, ప్రేమలో మోసాలు, మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు వంటి సామాజిక సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

 

కామారెడ్డి జిల్లా ఎస్పీ M. రాజేష్ చంద్ర IPS ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం ఈ కార్యక్రమాన్ని తాడ్వాయి సబ్-ఇన్స్పెక్టర్ Y. నరేష్ ఆధ్వర్యంలో చేపట్టింది. సైబర్ నేరాల విషయంలో టోల్ ఫ్రీ 1930కు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. ఎల్లారెడ్డి SHE టీమ్స్ సభ్యుడు PC శ్రీశైలం మహిళల భద్రత, అత్యవసర సమయంలో DIAL 100, అలాగే ప్రత్యేక హెల్ప్‌లైన్ 8712686094 గురించి విద్యార్థులకు వివరించారు.

 

రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్, మొబైల్ ఫోన్ డ్రైవింగ్, మాదకద్రవ్యాల వాడకం ప్రమాదాలను హెచ్చరించారు. చిన్నపిల్లలపై జరిగే లైంగిక నేరాలు, బాల్యవివాహాలు, మానవ అక్రమ రవాణాపై విద్యార్థులను అప్రమత్తం చేశారు.

 

పోలీస్ కళాబృందం ఇన్‌చార్జ్ హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, ఉ. శేషరావు, PCs ప్రభాకర్, సాయిలు పాటలు, నాటికల ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో MEO రామస్వామి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment