Site icon PRASHNA AYUDHAM

ఘనపూర్ హైస్కూల్‌లో సైబర్ ఫ్రాడ్‌ కా పుల్ స్టాప్ పై పోలీసుల అవగాహన 

Galleryit 20251223 1766484911

ఘనపూర్ హైస్కూల్‌లో సైబర్ ఫ్రాడ్‌ కా పుల్ స్టాప్ పై పోలీసుల అవగాహన

ప్రశ్న ఆయుధం

కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ డిసెంబర్ 23

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘనపూర్ ప్రభుత్వ హైస్కూల్‌లో మంగళవారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు, మాచారెడ్డి సబ్ ఇన్‌స్పెక్టర్ అనిల్ సూచనలతో పోలీస్ కళాబృందం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఈ సందర్భంగా విద్యార్థులకు సైబర్ నేరలపై , ఆన్‌లైన్ మోసాల నుంచి ఎలా జాగ్రత్తపడాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ 1930, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. అలాగే సెల్‌ఫోన్లు, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటివాటిలో జాగ్రత్తలు పాటించాల్సిన విధానాలను వివరించారు. మహిళలపై జరిగే నేరాల నివారణకు షీ టీమ్ సేవల గురించి తెలియజేస్తూ, షీ టీమ్ సెల్ నెంబర్ 8712686094ను పరిచయం చేశారు. పోలీస్ కళాబృందం ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ పీసీ సాయిలు మాటలు, పాటల ద్వారా సులభంగా అర్థమయ్యేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాచారెడ్డి ఏఎస్ఐ నరేందర్ రెడ్డి, పాఠశాల హెడ్‌మాస్టర్ శారద, పీసీలు ప్రవీణ్, రాజేందర్, మహిళా సాధికారిత ప్రతినిధి సౌందర్య తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version