బస్టాండ్‌లో పోలీసుల అవగాహన

బస్టాండ్‌లో పోలీసుల అవగాహన కార్యక్రమం

— నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు చైతన్యం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 23

కామారెడ్డి బస్టాండ్‌లో మంగళవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు దొంగతనాలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, షీ టీమ్స్, రోడ్డు ప్రమాదాలపై కళాబృందం పాటలు, మాటలతో ప్రజలకు సందేశాలు అందించింది.

మహిళా పిసి సౌజన్య, పిసి భూమయ్య, భాను పాల్గొని సైబర్ నేరాలపై 1930 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 ఉపయోగించాలన్నారు. షీ టీమ్స్ హెల్ప్‌లైన్ నంబర్ 8712686094 ను తెలియజేశారు.

మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌ మానుకోవాలని హెచ్చరించారు. యువత మాదకద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. చిన్నారులపై లైంగిక నేరాలు, బాల్య వివాహాలు, మహిళా భద్రతపై బరోసా టీమ్ అవగాహన కల్పించింది.

తల్లిదండ్రుల సలహాలను గౌరవించాలని, సోషల్ మీడియా వేదికల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాబృందం ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, యు. శేషారావు, పిసి ప్రభాకర్, సాయిలు పాల్గొని ప్రజలకు సందేశాలు అందించారు.

 

Join WhatsApp

Join Now