శిశువును విక్రయించేందుకు ప్రయత్నించిన ముఠాను పోలీసులు

 నవజాత శిశువును విక్రయించేందుకు ప్రయత్నించిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన చంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళితే.. షేక్‌ ఇస్మాయిల్‌, సుల్తానా బేగంలకు ఇటీవల ఓ బాబు జన్మించాడు. ఈ శిశువు వీరికి నాలుగో సంతానం. దీంతో 15 రోజుల చిన్నారిని అమ్మాలని వారు నిర్ణయించుకున్నారు. అందుకోసం మెహది అనే వ్యక్తిని సంప్రదించారు. ఫాతిమా రహ్మత్‌ అనే మరో వ్యక్తికి ఫోన్‌ చేసిన మెహది… బాబును విక్రయించాలని కోరాడు. దీంతో వారంతా కలిసి చిన్నారి విక్రయానికి ప్రణాళిక వేశారు. వీళ్లంతా చంద్రాయణగుట్టలో కలుసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.

Join WhatsApp

Join Now