దుర్గామాత నవరాత్రి మండపాలను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

పాయింట్ బుక్కులు చెక్ – DJలకు అనుమతి లేదు – కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి: కమిషనర్ సాయి చైతన్య

నిజామాబాద్, సెప్టెంబర్ 27 (ప్రశ్న ఆయుధం)

దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని వివిధ మండపాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్. స్వయంగా సందర్శించి, క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మండపాల వద్ద ఏర్పాటు చేసిన పాయింట్ బుక్కులను పరిశీలించారు. బుక్లో درجైన నిబంధనలు ప్రతి ఒక్కరూ తూచుగా పాటించాలని స్పష్టంగా హెచ్చరించారు. భక్తుల భద్రతపై నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కమిటీ సభ్యులు తప్పనిసరి

ప్రతి మండపం వద్ద ఉదయం, రాత్రి వేళల్లో కనీసం ఇద్దరు లేదా ముగ్గురు కమిటీ సభ్యులు హాజరుండాలని, వారు పోలీస్ చెకింగ్ సమయంలో కనిపించాలన్నారు. మండపాల వద్ద అసాంఘిక చర్యలు జరగకుండా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

డీజేలకు పూర్తిగా నిషేధం

డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని, వాటిని ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 12 డెసిబెల్స్ దాటి శబ్దం ఉండకూడదని, రాత్రి 10:00 గంటల తర్వాత లౌడ్‌స్పీకర్లు ఆపివేయాలని, ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమేనని తెలిపారు.

వర్షాభావం – విద్యుత్ జాగ్రత్తలు

ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండపాలపై పాలిథిన్ కవర్లు వేయాలని, విద్యుత్ తీగల విషయంలో పూర్తి జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

మహిళల భద్రతకు ప్రత్యేక జాగ్రత్తలు

మండపాలను సందర్శించే మహిళలు, యువతులపై ఈవ్ టీజింగ్ వంటి సంఘటనలు జరగకుండా నిర్వాహకులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు, వృద్ధులు, బిపి, గుండె జబ్బులు ఉన్నవారికి ఇబ్బంది కలగకుండా సౌండ్ సిస్టమ్ నియంత్రణలో ఉండాలన్నారు.

ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే సమాచారం ఇవ్వండి

ప్రజలకు అసౌకర్యం కలిగించే సంఘటనలు, సమాచారం ఉంటే వెంటనే సమీపంలోని పోలీసులకు తెలియజేయాలని, డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్: 87126-59700 కు సమాచారం ఇవ్వవచ్చని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now