నిజామాబాద్ జిల్లా ప్రజలకు పలు ముఖ్య సూచనలు చేసిన పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్

నిజామాబాద్ జిల్లా ప్రజలకు పలు ముఖ్య సూచనలు చేసిన పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ : అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక.

నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవార్, 16-10-2024 నుండి 31-10-2024 వరకు అమలులో ఉండే కొన్ని ముఖ్యమైన నిబంధనలను ప్రకటించారు,

ఈ నిబంధనలను పాటించడం వల్ల జిల్లా ప్రజల శాంతి, భద్రతలు కాపాడవచ్చని ఆయన పేర్కొన్నారు.

విగ్రహాల ఏర్పాటుకు సంబంధిత నిబంధనలు : ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్టించడం నిషిద్ధం. ముఖ్యంగా రద్దీగా ఉన్న ప్రదేశాలు, పార్కులు, ప్రభుత్వ భవనాలు వంటి చోట్ల విగ్రహాలు ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరిగా పొందాలి.

డి.జే మ్యూజిక్ పై నియంత్రణలు : డీ.జేలను ఏర్పాటు చేయడం ద్వారా ఉత్పత్తి అయ్యే శబ్దం వృద్ధులు, చిన్న పిల్లలు, మహిళలకు అనారోగ్యాన్ని కలిగించవచ్చు. అందువల్ల రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు డి.జే శబ్దం నిషిద్ధం రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రదేశాల్లో 55 డెసిబెల్స్ మించకుండా ఉండాలి.

సభలు, ఊరేగింపులకు అనుమతి తప్పనిసరి : బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించాలనుకుంటే, 500 మందికి పైగా ఉంటే, 72 గంటల ముందుగా పోలీస్ కమీషనర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.

సెక్యూరిటీ నిబంధనలు : మాల్స్, సినిమా థియేటర్లు, హోటల్స్ ఇతర వ్యాపార ప్రదేశాల్లో సెక్యూరిటీ పరంగా నిబంధనలు పాటించాలి, క్యూ పద్ధతిని తప్పనిసరిగా అనుసరించాలి.

డ్రోన్ల వినియోగం : డ్రోన్ల వాడకం సంబంధిత నియంత్రణలు తీసుకోవడం జరుగుతుంది, జనజీవనానికి విఘతం, శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది, ప్రజల ప్రయోజనాల కోసం డ్రోన్లు ఉపయోగించాలని అనుకుంటే, సంబంధిత ప్రభుత్వ సంస్థల నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి.

నకిలీ గల్ఫ్ ఏజెంట్ల పై అవగాహన : జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్లు మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని పోలీస్ కమీషనర్ తెలిపారు, ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు వారి సమాచారాన్ని సంబంధిత పోలీసు స్టేషన్‌కు తెలియజేయాలని సూచించారు.

మైనర్లకు“ఎ” సర్టిఫికేట్ సినిమాలు నిషిద్ధం : నిజామాబాద్‌లో“ఎ” సర్టిఫికేట్ పొందిన సినిమాలను మైనర్లు చూడటానికి థియేటర్లలకు అనుమతించరాదని ప్రకటించారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనం నిషేధం : బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, ప్రజలపై అసభ్యకరమైన ప్రవర్తనను ప్రదర్శిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి, ప్రజల ప్రశాంతతను దెబ్బతీస్తోంది, అందువల్ల బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధం విధించారు.

ముఖ్య గమనిక : ఈ నిబంధనలు అందరు తెలుసుకోవడం, పాటించడం చాలా ముఖ్యం. ఎవరైన ఈ నిబంధనలను అతిక్రమిస్తే వారిపై సంబంధిత చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్‌లోని పోలీసులు ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తారు కావున ప్రజలు సర్కారుకు సహకరించాలని కోరారు.

పైన తెలిపిన నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే మీకు సమీపంలో ఉండే పోలీస్ స్టేషలకు, లేదా 100 కు డయల్ చేసి తెలియచేయాలని కోరారు.

Join WhatsApp

Join Now