Site icon PRASHNA AYUDHAM

అక్రమ కట్టడాలపై పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఉక్కు పాదం..!!!

IMG 20240811 WA0081

హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాలపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఉక్కుపాదం మోపుతు న్నారు. తాజాగా చందానగర్ పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేడు కూల్చివే స్తున్నారు.వైశాలినగర్ లోని ప్రభుత్వ భూమిలో మూడు అక్రమ నిర్మాణాలను గుర్తించిన హైడ్రా… భారీ బిల్డింగ్ లను JCBలతో నేలమట్టం చేస్తోంది. నిన్నటి ఉదయం నుంచి మొదలైన కూల్చివేత లు..ఇవాళ సైతం కొనసా గుతున్నాయి. కూల్చివేత టైమ్ లో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా అధికారులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు.కాగా , దాదాపు 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బూమ్రు ఖుద్దీన్‌ దవాళ్‌ చెరువులో అధికారుల నిర్లక్ష్యంతో బఫర్‌ జోన్లలో నిర్మాణాలు జోరందుకున్నాయి. దాదాపు 10 ఎకరాల చెరువు భూమిని కబ్జా చేసినట్లు గుర్తించారు.

 

రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. మొత్తం 20 ప్రహరీలు, 6 నిర్మాణాలను పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేప ట్టారు. బహదూర్‌పురా ఎమ్మెల్యే ముబిన్‌ కూల్చి వేతలను నిలిపివేయాలని హైడ్రా సిబ్బందిని అడ్డుకోగా, పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

Exit mobile version