నవరాత్రుల తొలి రోజైన బాల త్రిపురసుందరి అలంకరణలో పాల్గొన్న సీపీ
నిజామాబాద్, సెప్టెంబర్ 22 (ప్రశ్న ఆయుధం):
నవరాత్రి మహోత్సవాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య శనివారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని దుర్గాపరమేశ్వరి మాత మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిదినమైన బాల త్రిపురసుందరి అలంకరణలో భాగంగా, కమిషనర్ స్వయంగా అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నవరాత్రులు నూతన శక్తి, భక్తి, విజయానికి ప్రతీకలు. బాల త్రిపురసుందరి దేవి పూజా కార్యక్రమంలో పాల్గొనడం దైవానుగ్రహంగా భావిస్తున్నాం. ఈ ఉత్సవాలు సమాజంలో శాంతి, సమరసత, సద్భావనలను పెంపొందిస్తాయి” అని అన్నారు. ప్రజలందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆ తర్వాత జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులకు కమిషనర్ స్వయంగా అన్నం వడ్డించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ (అడ్మిన్), ఎంటిఓ శేఖర్ బాబు, తిరుపతి, సతీష్, ప్రధాన అర్చకులు జోషి వెంకటేష్ శర్మ, దుర్గామాత మందిరం ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది, స్పెషల్ 3 బృందం తదితరులు పాల్గొన్నారు.