బంగారం షాప్ దొంగను పట్టుకున్న పోలీస్ లు

*బంగారం షాప్ దొంగను పట్టుకున్న పోలీస్ లు*

ప్రశ్న ఆయుధం న్యూస్ జుక్కల్ నియోజక వర్గ ప్రతినిధి ఏప్రిల్-20

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం నరసింహ జువెలరీ షాప్ లో ఇ నెల 07 తారీఖున అర్దరాత్రి దొంగతనానికి పాల్పడిన నిధితున్ని పట్టుకొని అతని వద్ద నుండి 9.732 కిలోల వెండి వస్తువులను

22 గ్రాముల బంగారం ను స్వాధీనం చేసుకొని రిమాండ్ కి తరలించడం జరిగింది అని జిల్లా ఎస్పీ రాజేష్ చెంద్ర తెలిపారు.

జువెలరీ షాప్ దొంగతనం పై బాన్స్వాడ రూరల్ సిఐ రాజేష్

ఆధ్వర్యం లో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించి సిసిటివి పుటేజి,ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిధితున్ని కోసం వెతుకుతుండగా శనివారం రోజు ఒక అనుమానితున్ని పట్టుకొని విచారించగా దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించాడు.

నేరస్తుడు గతంలో మద్నూర్ మండలం లోని తాళం వేసి ఉన్న ఇంటిలో దొంగతనం చేయగ మద్నూర్ పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 51/2024 u/sec 457,380

ipc కేసులో జైలుకు వెళ్ళినాడు అని తెలిపారు.

నిండితుని వివరాలు: ఉప్పల్ వార్ శ్రీనివాస్ తండ్రి సాయిలు, వయసు 35, మద్నూర్ గ్రామ వాస్తవ్యుడు.

అతి తక్కువ సమాయం లో కేసును చేదించిన రూరల్ సిఐ.రాజేష్,పిట్లం ఎస్సై

యాన్. రాజు, కానిస్టేబుల్ శ్యామ్, వసి, మహేష్,బాలాజీ మరియు హోమగార్డ్ నాగరాజు లను జిల్లా ఎస్పీ అభినందించారు…

Join WhatsApp

Join Now