నకిలీ ఇంజన్ ఆయిల్ పట్టుకున్న పోలీసులు
వరంగల్ మట్టెవాడలోని స్పార్క్ ల్యూబ్రికెంట్స్ షాపులో బుధవారం నకిలీ ల్యూబ్రికెంట్స్ ఆయిల్ నిల్వలు ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు సమాచారం అందుకున్నారు. ఈ మేరకు షాపుపై దాడి చేసి రూ.91,620 విలువైన నకిలీ ఆయిల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ మధుసూదన్ తెలిపారు. నిందితులు మురళీధర్, ఉదయ్ కుమార్ ను అదుపులోకి తీసుకొని మట్టెవాడ పోలీసులకు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.