సైబర్ నేరాలపై విద్యార్థులకు పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమం

సైబర్ నేరాలపై విద్యార్థులకు పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమం

 

ప్రశ్న ఆయుధం

కామారెడ్డి జిల్లా అక్టోబర్ 17

శుక్రవారం రోజున కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల పరిధిలోని పోసానిపేట్ హై స్కూల్లో దొంగతనాలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, షీ టీమ్స్,రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆప్ పోలీస్ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశానుసారం జిల్లా పోలీస్ కళాబృందంచే అవగాహన విద్యార్థులకు కల్పించారు. ఈ కార్యక్రమంలో సైబర్ నేరాలపై టోల్ ఫ్రీ నెంబర్ 1930 కామారెడ్డి షీ టీమ్స్ సభ్యులు డబ్ల్యు పి సి ఎస్ సౌజన్య, పీసీ భూమయ్య అవగాహన కల్పిస్తూ షీ టీమ్స్ నెంబర్ 8712686094 అత్యవసర సమయంలో డయల్ 100 కు కాల్ చేయాలని రోడ్డు ప్రమాద నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు గంజాయి సేవించి యువత పెడదారి పట్టకుండా తాము తీసుకున్న చర్యలను వివరించారు. మహిళల పై అలాగే చిన్న పిల్లలపై జరుగు హత్య నేరాలు బాల్య వివాహాలు, చిన్నపిల్లలపై జరిగే లైంగిక నేరాల పట్ల, సోషల్ మీడియా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యార్థు లకు అర్థమయ్యే విధంగా మాటల, పాటల ద్వారా పోలీస్ కళాబృందం ఇన్చార్జి కానిస్టేబుల్ రామాంజనేయ తిరుపతి, శేష రావు, PCలు ప్రభాకర్ సాయిలు పాల్గొని వివరించారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెడ్ మాస్టర్ రాజలింగం,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment