తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్
–సీనియర్ అడ్వకేట్, కామారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గజ్జల బిక్షపతి ముదిరాజ్
ప్రశ్న ఆయుధం న్యూస్, నవంబర్ 30, కామారెడ్డి :
కామారెడ్డి జిల్లా ముదిరాజ్ ముద్దుబిడ్డ పోలీస్ కిష్టయ్య 2009 డిసెంబర్ 1 న కామారెడ్డి పట్టణంలో బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి తన తుపాకీతో కాల్చుకొని తెలంగాణ కోసం తొలి వీర మరణం పొందాడని సీనియర్ అడ్వకేట్, కామారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గజ్జల బిక్షపతి ముదిరాజ్ అన్నారు. డిసెంబర్ 1న ప్రతీ గ్రామ గ్రామాన కిష్టయ్యకు ఘన నివాళి అర్పిద్దామని, అదేవిధంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ఉన్న పోలీస్ కిష్టయ్య విగ్రహానికి డిసెంబర్ 1న ఉదయం 10 గంటలకు ముదిరాజ్ సోదరులందరు పాల్గొని నివాళులు అర్పించాలన్నారు. ఈ కార్యక్రమానికి ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పున్న రాజేశ్వర్ తో పాటు ఇతర ప్రధాన ముదిరాజు బంధువులందరూ పాల్గొంటున్నారని, కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు.