పోలీసు కిష్టయ్య కు ముదిరాజ్ నాయకుల ఘన నివాళులు

పోలీసు
Headlines in Telugu:
  1. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు పోలీసు కిష్టయ్య కు ముదిరాజ్ నాయకుల ఘన నివాళి
  2. పోలీసు కిష్టయ్య ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి కార్యక్రమం
  3. తెలంగాణ ఉద్యమంలో పోలీసు కిష్టయ్య అమరత్వం గుర్తుపెట్టుకుంటూ నివాళులు
  4. ముదిరాజ్ సంఘం నాయకులు పోలీసు కిష్టయ్యకు స్మారక నివాళి
  5. పోలీసు కిష్టయ్య త్యాగం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మేలైన ప్రేరణ

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, తొలి అమరుడు పుట్టకొక్కుల (పోలీసు) కిష్టయ్య ముదిరాజ్ వర్ధంతిని, ఆదివారం రోజున బెజ్జంకి మండల కేంద్రంలో, మండలంలోని ముదిరాజ్ సంఘ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. మండలం లోని ముదిరాజ్ కులస్థులు అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకొని పోలీసు కిష్టయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి, జోహార్.. పోలీసు కిష్టయ్య, అమరహే.. పోలీసు కిష్టయ్య ముదిరాజ్ అని నినదిస్తూ, స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చీలాపూర్ తాజా మాజీ సర్పంచ్ రావుల మొండయ్య ముదిరాజ్ మాట్లాడుతూ, పోలీస్ కిష్టయ్య చేసిన త్యాగం మరువలేనిదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముదిరాజ్ బిడ్డ తొలి అమరుడు ప్రాణ త్యాగం చేయడం, తెలంగాణ రాష్ట్ర నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చినందుకు గర్వంగా ఉందని అన్నారు. పోలీస్ కిష్టయ్య అమరత్వం మరిచిపోలేమని, తెలంగాణ ఉద్యమాన్ని ఆప్పటి ప్రభుత్వము నిర్లక్ష్యం చేయడాన్ని జీర్ణించుకోలేక ప్రాణత్యాగము చేసి, నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చినందుకు తన ప్రాణాన్ని తృణప్రాయంగా అంకితమిచ్చిన కిష్టయ్య ను మరువలేమన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు కొరివి తిరుపతి ముదిరాజ్, రావుల రాజు ముదిరాజ్, దేవనబోయిన సంతోష్ ముదిరాజ్, బెజ్జంకి టౌన్ అధ్యక్షులు రావుల కనకయ్య ముదిరాజ్, కోడూరు రాజయ్య ముదిరాజ్, యూత్ అధ్యక్షులు రావుల ప్రశాంత్ ముదిరాజ్, మాజీ మార్కెట్ డైరెక్టర్ రావుల మహేష్ ముదిరాజ్, జెట్టి అర్జున్ ముదిరాజ్, కొలవేని సదానందం ముదిరాజ్, దేవనబోయిన సంపత్ ముదిరాజ్, జంగా మల్లేశం ముదిరాజ్, బర్ల పెద్ద రాజయ్య ముదిరాజ్, అట్ల యాదగిరి ముదిరాజ్, ఎరవెల్లి శ్రీనివాస్ ముదిరాజ్, రావుల రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now