Site icon PRASHNA AYUDHAM

ఫిర్యాదు చేసిన గంటలో కేసును చేదించిన తల్లి పిల్లను అప్పగించిన పోలీసు సిబ్బంది

IMG 20250221 WA0093

*ఫిర్యాదు చేసిన గంటలో కేసును చేదించిన తల్లి పిల్లను అప్పగించిన పోలీసు సిబ్బంది*

* ఎస్ఐ రాజకుమార్ పోలీస్ సిబ్బందిని అభినందించారు*

ఇల్లందకుంట ఫిబ్రవరి 21 ప్రశ్న ఆయుధం

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన నక్క కృష్ణ సువర్ణల కుమార్తె అయిన పల్లెర్ల రుచిత తన కూతురైన పది నెలల సుదీక్షతో తన తల్లి ఇంటి నుండి కనిపించకుండా పోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన ఎస్సై రాజకుమార్ తన సిబ్బందితో రుచిత యొక్క ఫోన్ ఆధారంగా ఒక గంట సమయంలో రుచితను తన కుమార్తె సుదీక్షను సురక్షితంగా పట్టుకొని నక్క సువర్ణ కృష్ణ లకు అప్పచెప్పారు వివరాల్లోకి వెళితే నక్క సువర్ణ కృష్ణల కుమార్తె అయిన రుచితకు రెండు సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన పల్లెర్ల అరవింద్ తో ప్రేమ వివాహము జరిగినదని వారికి ఒక పాప జన్మించి 10 నెలలు గడిచిందని కానీ రెండు నెలల క్రితం వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరగడంతో ఆమె అత్తమామల ఇంటి నుండి వెళ్లి తల్లి వద్దనే ఉంటుందని తెలిపారు శుక్రవారం రోజు మధ్యాహ్నం 12:15 నిమిషాలకు రుచిత తల్లికి ఫోన్ చేసి వంద రూపాయలు కావాలని అడగడంతో తీసుకోమని చెప్పడం జరిగిందని తరువాత కొంతసేపటికి తల్లి ఫోన్ చేయగా తన కూతురు మొబైల్ స్విచాఫ్ రావడంతో చుట్టూ ప్రక్కల వారిని అడిగి తెలుసుకోగా ఎక్కడ కనిపించకపోవడంతో వెంటనే అనుమానం వచ్చిన తల్లి స్థానిక పోలీస్ స్టేషన్లో 2:30 ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన ఎస్సై రాజ్ కుమార్ తన సిబ్బందితో యువతి యొక్క మొబైల్ నెంబర్ ట్రేస్ చేసి మొబైల్ లొకేషన్ ఆధారంగా 3 :30 నిమిషాలకు జమ్మికుంట మండలం పెద్దపల్లి గ్రామ శివారులో కనుక్కోవడం జరిగిందని ఎస్ఐ రాజకుమార్ తెలిపారు తప్పిపోయిన ఆమెను వెళ్లి అడగగా ఆమె తన భర్తకు జరిగిన గొడవల వలన జీవితంపై విసుగు చెంది తన పది నెలల పాపతో చావడానికి సిద్ధపడి ఇక్కడికి వచ్చాను అని చెప్పడం జరిగిందని వెంటనే ఎస్ఐ రాజ్ కుమార్ యువతి భర్త పల్లెర్ల అరవింద్ కు ఆ యువతని కౌన్సిలింగ్ రుచిత తల్లి అయిన సువర్ణకు అప్పగించడం జరిగిందని తెలిపారు ఫిర్యాదు చేసిన గంటలు స్పందించి తల్లి బిడ్డలను కాపాడినందుకు పలువురు ఎస్సై రాజ్ కుమార్ ను పోలిసిబ్బందిని అభినందించారు

Exit mobile version