జిల్లా ఎస్పీ ఆదేశాలతో సమస్యాత్మక గ్రామాలలో పోలీసుల పల్లెనిద్రలు

అనంతపురం :

జిల్లా ఎస్పీ ఆదేశాలతో సమస్యాత్మక గ్రామాలలో పోలీసుల పల్లెనిద్రలు

* గ్రామాల్లోని తాజా పరిస్థితులు తెలుసుకుని సమస్యలను మొగ్గ దశలో తుంచేలా చర్యలు

జిల్లా ఎస్పీ పి.జగదీష్ IPS ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ఆయా సమస్యాత్మక గ్రామాలలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులతో మాట్లాడి తాజా పరిస్థితులపై ఆరా తీశారు. సమస్యలు తీవ్రం కాకుండా మొగ్గ దశలో తుంచేసేలా చర్యలు తీసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని… ఎవరైనా గొడవలకు పాల్పడినా, అసాంఘిక కార్యకలాపాలకు జోలికెళ్లినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నియణ, మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, మత్తు పదార్థాల అనర్థాలు & సైబర్ మోసాలు గురించి అవగాహన చేశారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే 1930 కి కాల్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు అవగాహన కలిగించారు.

Join WhatsApp

Join Now