గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

*గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు*

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జిల్లాలోని నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో గుడుంబా స్థావరాలపై బుధవారం టాస్క్ ఫోర్స్, నీల్వాయి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి, 5లీటర్ల గుడుంబాను సీజ్ చేసి, 22 డ్రమ్ముల్లో సుమారు 4 వేల లీటర్ల బెల్లం పానకాన్ని, గుడుంబా తయారీ చేసే ముడి సరుకు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, ఐపీఎస్, ఐజి ఆదేశాల మేరకు నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బుయ్యారం గ్రామ సమీప అడవుల్లో రహస్యంగా నిర్వహిస్తున్న గుడుంబా స్థావరాలను ధ్వంసం చేయడం జరిగిందన్నారు. ఇంటి పరిసరాలలో గుడుంబా తయారీ బట్టి నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసి, ఐదు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. సమీప అడవిలో గుడుంబా తయారీ కోసం కలిపి ఉంచిన 22 డ్రమ్ముల్లో ఉన్న సుమారు 4 వేల లీటర్ల పానకాన్ని ధ్వంసం చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు బుయ్యారం గ్రామానికి చెందిన కొరకుప్పుల సత్యక్క, ఆడేలింగు భాయ్ లపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ సిఐ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న, టాస్క్ ఫోర్స్ సిబ్బంది, నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment