Site icon PRASHNA AYUDHAM

డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికీ పోలీసుల విన్నపం.

IMG 20250809 WA1000

డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికీ పోలీసుల విన్నపం.

1.ఈ భూమిపై మరో జన్మ పొందటానికి తల్లి గర్భంలో 9 నెలలు వేచి చూడాలి.

2. నడవడానికి 2 సంవత్సరాలు.

3. స్కూల్ కి వెళ్ళడానికి 3 సంవత్సరాలు,

4. ఓటు హక్కు కై 18 సంవత్సరాలు,

5. ఉద్యోగం కోసం 25 సంవత్సరాలు,

6. పెళ్ళికోసం 25నుండి 30 సంవత్సరాలు… ఇలా ఎన్నో సందర్భాలలో (వెయిట్) వేచి ఉంటాము.

కానీ…

ఓవర్ టేక చేసే సమయంలో.. వాహనాలు నడుపుతున్నపుడు, 30 సెకన్లు కూడా ఆగలేక పోతున్నాము.

తర్వాత తప్పిపోయి ఏమన్నా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ లో గంటలు, రోజులు, వారాలు, నెలలు, అవసరమైతే సంవత్సరాలు కూడా కోలుకోలేని పరిస్థితి..

కొన్ని సెకన్ల గడబిడ ఎంత భయంకరమైన పరిణామాలు ఎదుర్కొంటున్నారో ఆలోచించండి.

ముందు వెళ్ళేవారు వెళ్ళనీ.. వెనకాల హాయిగా వెళ్ళిపో..

దయచేసి సరైన వేగం, సరైన దిశలో ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ..హెల్మెట్ వాడుతూ.. వాహనాలు నియంత్రణలో ఉంచుకొని నడపండి. మరియు సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుకోండి.

మీ కోసం, మీ యొక్క కుటుంబ సభ్యులు, పిల్లలు మీ ఇంటి వద్ద ఎదురు చూస్తుంటారని మరవకండి..

జాగ్రత్తగా వెళ్ళండి..

Exit mobile version