Site icon PRASHNA AYUDHAM

రాజధాని నగరం మంగళగిరిలో భారీ బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు

IMG 20250222 WA0072

*రాజధాని నగరం మంగళగిరిలో భారీ బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు*

*6 రోజులలోనే బంగారం స్వాధీనం చేసుకున్న గుంటూరు పోలీసులు*

*5కోట్ల రూపాయల విలువ చేసే బంగారం, రెండు ద్విచక్ర వాహనాలు,2లక్షల నగదు స్వాధీనం*

*బంగారం దొంగతనం కేసులో 8మంది ముద్దాయిలు అరెస్ట్, 4కేజీల. 8గ్రాముల బంగారం, 2లక్షల నగదు స్వాధీనం…*

5కేజీల బంగారం చోరీ కేసును 6రోజులలో చేధించిన ముద్దాయిలను అరెస్ట్ చేసిన గుంటూరు జిల్లా పోలీసులు..

6ప్రత్యేక బృందాలు సమిష్టిగా కేసును ఛేదించి 5కోట్ల విలువగల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు…

పక్కా ప్రణాళిక, రెక్కీ, పథక రచనతో రెండు ద్విచక్ర వాహనాలతో వెంబడించి సినీ ఫక్కీలో బంగారం చోరీ చేసిన నిందితులు

విజయవాడలో డి వి ఆర్ జ్యుయాలర్స్ షాప్ యజమాని రాము తన దుకాణంలో తయారు చేసిన బంగారు ఆభరణాలు నల్గొండ, సూర్యాపేట నకేరేకల్లు ప్రాంతాల్లో ఉన్న పలు దుకాణాలు సరఫరా చేస్తూవుంటారు…..

బంగారు ఆభరణాలు బ్యాగులో భద్రపరచి షాపులో పనిచేసే నాగరాజు అప్పగించి తన ఇంటి వద్దకు వచ్చి ఇవ్వాలని ఇవ్వడం జరిగింది…

తదుపరిబంగారు ఆభరణాలు బ్యాగ్ దొంగతనం జరిగిందని యజమాని రాముకు ఫోన్ ద్వారా సమాచారం అందించిన నాగరాజు..

ఇరువురు వ్యక్తులు బైక్ పైవచ్చి మంగళగిరి పరిధి ఆత్మకూరు వద్ద బంగారుఆభరణాలు లాక్కొని వెళ్లినట్లు తెలిసిన నాగరాజు…

నాగరాజుకు సహకరించిన భరత్, నవీన్, ఇర్ఫాన్, మోహన్, లోకేష్, చందు, అరుణ్…

దొంగిలించిన బంగారు ఆభరణాలు కొంత కరిగించి ముద్దాలుగా మార్చిన నిందితులు …

బంగారు ముద్దాలను సైతం స్వాధీనం చేసుకున్న పోలీసు బృందాలు…

నిందితులలో ఒకరైన ఇర్ఫాన్ పరారీలో ఉన్నాడు అతనివద్ద కొంతమేర బంగారం రికవరీ చేయవలసి ఉంది..

కేసు చేదించిన పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్

Exit mobile version