నవరాత్రి వేడుకల్లో పోలీస్ ల సేవ కార్యక్రమాలు

నిజామాబాద్, సెప్టెంబరు 27 (ప్రశ్న ఆయుధం)నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న దుర్గా పరమేశ్వరి మాత ఆలయంలో శనివారం జరిగిన లలితా త్రిపురసుందరి దేవి అలంకరణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ హాజరై భక్తులకు అన్నదాన సేవలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆదనపు డీసీపీ (ఏఆర్) రామచంద్రరావు, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, సీటీసీ ఏసీపీ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, ఎస్‌ఐ సంతోష్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ (అడ్మిన్), తిరుపతి (వెల్ఫేర్), సతీష్ (హోమ్‌గార్డ్), వినోద్ (ట్రాఫిక్) తదితరులు పాల్గొన్నారు.

అలాగే, పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సిబ్బంది, సీపీ కార్యాలయం సిబ్బంది, సీసీఆర్బీ, స్పెషల్ పార్టీ, హోమ్‌గార్డ్స్ విభాగం, రేంజ్ కార్యాలయ సిబ్బంది, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది తదితరులు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

Join WhatsApp

Join Now