దళిత మహిళను హింసించిన పోలీసులను అరెస్టు చేయాలి

దళిత మహిళపై పోలీసుల దాడి హేయమైన చర్య

ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రోల్ల రవిబాబు

సిద్దిపేట ఆగస్టు 5 ప్రశ్న ఆయుధం :

షాద్ నగర్ లో అకారణంగా దొంగతనం నెపంతో పోలీసులు దళిత కులానికి చెందిన సునీతమ్మ ను మరియు వారి కుటుంబ సభ్యులను విచక్షణ రహితంగా కొట్టడం అత్యంత హేయమైన చర్య అని ఇది రెడ్డి రాజ్యానికి పరాకాష్ట అని దాడికి పాల్పడిన పోలీస్ అధికారి డి ఐ రామ్ రెడ్డి మరియు ఇతర పోలీసు అధికారుల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విధుల నుండి శాశ్వతంగా బహిష్కరించాలని దీనికి జిల్లా పోలీస్ ఉన్నతాధికారి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర తొలి రెడ్డి రాజ్య స్థాపకుడు ఏనమల రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రోళ్ల రవిబాబు డిమాండ్ చేశారు. తన రాజ్యంలో ఎప్పటికీ అణగారిన వర్గాల పైన ఇలాంటి దాడులే జరుగుతాయని రుజువు అవుతున్నదని అందుకు టిఆర్ఎస్ వెలమ దొరల పాలనలో దళితులపై నేరెళ్ల ఘటన లాగే కాంగ్రెస్ పార్టీ రెడ్డి రాజ్యంలో పోలీస్ రాజ్యాన్ని అమలు చేస్తున్నదని అమాయకుల ప్రాణాలతో చెలగాట మాడుతుందని ఇదిగో అగ్రకుల పార్టీల పాలకవర్గాలు ఎవరైనా ఈ రకంగా నే దాడి చేస్తారని ఇలాంటి దగాకోరు రాజకీయ అగ్రకుల పార్టీలను అనగారిన వర్గాలంతా తరిమేయాలని ఇది బహుజనుల రాజ్యం కాదని అగ్రకుల రెడ్డి దొరల రాజ్యంలో పోలీసు వ్యవస్థనే రాజ్యమేలుతుందని ఎద్దేవ చేశారు. అసలు దొంగలను పట్టుకోకుండా నేరం ఒప్పుకోవాలని బలవంతంగా ఓ మహిళా అని చూడకుండా మహిళా కానిస్టేబుళ్లు లేకుండా కాళ్లు చేతులు కట్టేసి వివస్త్రను చేసి ఎక్కడపడితే అక్కడ అత్యంత దారుణంగా కొట్టడం అవమానహేమైన మరియు హేయమైన చర్యగా ధర్మ సమాజ్ పార్టీ బావిస్తుందని. కొత్త నేర చట్టాలను ఆసరాగా చేసుకుని అకారణంగా కేసు నమోదు చేసినప్పటికీ జ్యూడిషియల్ రిమాండ్ చేయకుండా పోలీసు కస్టడీలో నే 13 రోజులుగా ఈ రకమైన దాడికి పాల్పడడం పోలీసు ఉన్నతాధికారులకు తెలియటం లేదా అందుకు ఈ అకారణ దాడికి పాల్పడిన పోలీస్ అధికారులు రామిరెడ్డి మరియు సహకరించిన కానిస్టేబుల్స్ అధికారులను విధుల నుండి శాశ్వతంగా బహిష్కరించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భవిష్యత్తులో ఎక్కడ దళితుల మీద అకారణంగా దాడులు జరిగిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఆ బాధిత కుటుంబానికి మెరుగైన వైద్య సహాయము ఆర్థిక సహకారాన్ని అందించి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని లేనిచో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడానికి సిద్ధమవుతుందని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now