Site icon PRASHNA AYUDHAM

పోలీస్ క్రిష్టన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

IMG 20240809 WA0152

*సర్వే నం.467లో పోలీస్ కిష్టన్న విగ్రహం ఏర్పాటు చేయాలి*

*తహశీల్దారుకు ప్రజాశివసేన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామి వినతి పత్రం*

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 9*

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ లోని పాత మున్సిపల్ ఆఫీసు సమీపంలో ఉన్న సర్వే నం.467లో గల ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించుకొని ప్రహరీ గోడ నిర్మించారని ఆ భూమిని సర్కారు స్వాధీనంలోకి తీసుకోవాలని ప్రజాశివసేన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బోళ్ల స్వామి ముదిరాజ్ కోరారు 2018లో సదరు సర్వేనం.లోని భూమిని ప్రభుత్వ భూమిగా చూపించారని గుర్తుచేశారు ఆ 9 గుంటల భూమిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని ప్రభుత్వ ఆఫీసు కానీ పార్క్ కానీ ఏర్పాటు చేయాలన్నారు తెలంగాణ అమరవీరుల చౌక్ గా పిలవబడే సదరు ప్రాంతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరుడైన పోలీస్ కిష్టన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు ఈ మేరకు స్వామి శుక్రవారం జమ్మికుంట తహశీల్దారు జి.రమేశ్ బాబుకు వినతి పత్రం సమర్పించారు.

Exit mobile version