పోలీస్ స్టేషన్ తొమ్మిదవ స్థానం స్థానం..

ప్రజలకు సత్వర సేవలు అందించడంలో రాష్ట్రవ్యాప్తంగా మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కు తొమ్మిదవ స్థానం..

 తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ రెడ్డి చేతులమీదుగా అవార్డు అందుకున్న మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ దీపిక.ఏదైనా సమస్యలతో పోలీస్ స్టేషన్ లకు వచ్చిన బాధితులతో మర్యాదగా ప్రవర్తించి వారి సమస్యలను విని చట్టపరిధిలో పరిష్కరించడం, వారికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నమ్మకం కలిగేలా చేయడంలో.., ప్రజల ఆన్లైన్ ఫీడ్ బ్యాక్ ద్వారా సేకరించిన వివరాలప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు సత్వర సేవలు అందించడంలో 10 పోలీస్ స్టేషన్ లను ఎంపిక చేసారు. ఇందులో మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ తొమ్మిదవ స్థానం స్థానం పొందడం జరిగింది.డీజీపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ రెడ్డి చేతులమీదుగా రూరల్ ఎస్ఐ దీపిక అవార్డు అందుకున్నారు.మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బందిని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now