వినాయక నవరాత్రులపై పోలీసుల సూచనలు – కాలనీల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి
గణేష్ మండపాల నిర్వాహకులు శాంతియుత వాతావరణం కోసం చర్యలు తీసుకోవాలి.
ప్రతి కాలనీ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచన,
పండుగ సమయంలో ప్రజల భద్రత కోసం జాగ్రత్తలు తీసుకోవాలి.
శాంతి భద్రతల కోసం పోలీసుల సహకారం అందించనున్నట్టు హామీ.
స్నేహపురి కాలనీలో జరిగిన కార్యక్రమంలో పోలీసుల అవగాహన పిలుపు.
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్.ప్రశ్న ఆయుధం)ఆగస్టు 14
రాబయే వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా పండుగలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, అలాగే కాలనీల పరిసరాల్లో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కామారెడ్డి పోలీసు శాఖ సూచించింది.గురువారం స్నేహపురి కాలనీలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎస్సై బాల్ రెడ్డి, కానిస్టేబుల్ కమలాకర్ పాల్గొని, గణేష్ మండపాల నిర్వాహకులు, స్థానిక ప్రజలకు పలు జాగ్రత్తలు వివరించారు. పండుగ సమయంలో అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.ప్రజల సహకారంతోనే భద్రతా ఏర్పాట్లు ఫలిస్తాయి. పండుగ అందరికీ ఆనందంగా జరగాలంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి” అని పోలీసు సిబ్బంది తెలిపారు.