ప్రాజెక్టుల సందర్శకులకు పోలీసుల హెచ్చరిక

ప్రాజెక్టుల సందర్శకులకు పోలీసుల హెచ్చరిక

*కుకునూరుపల్లి, జనవరి 13,:

గజ్వేల్ నియోజకవర్గంలోని కుకునూరుపల్లి మండలంలో ఉన్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ వద్ద కుకునూరుపల్లి పోలీసులు సోమవారం హెచ్చరిక సూచిక జారీ చేస్తూ ఒక బ్యానరును ఏర్పాటు చేసారు. కుకునూరుపల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దానిని ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎవరు చేపల వేటకుగాని, సెలవులని ఈతకు వెళ్లడంగాని చేయకూడదని సూచించారు. గతంలో ఇలా వెళ్లి ప్రాణాలు కోల్పోయిన సంగతి ఆయన గుర్తు చేసారు. మొన్న జరిగిన కొండపోచమ్మ రిజర్వాయర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సంఘటన కూడా అందరికి తెలిసిందేనన్నారు. ఐదుగురు యువకులు దుర్మరణం చెంది వారి తల్లిదండ్రులకు పుట్టెడు శోఖాన్ని మిగిల్చారని ఎస్సై శ్రీనివాస్ పేర్కొన్నారు. చేతికి అంది వచ్చిన కొడుకులను కోల్పోయిన వారి తల్లిదండ్రుల మనోవేదన ఎవరు తీర్చలేనిదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సృష్టిలో విలువైంది ప్రాణం మాత్రమేనని, దాన్ని తిరిగి పొందలేమని, రిజర్వాయర్ సందర్శనకు వెళ్లే సందర్శకులు దయచేసి పోలీసు, ప్రభుత్వం వారి యొక్క సూచనలు పాటించవలసిందిగా ఆయన కోరారు. ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉందని, అందులో మొసల్ల సంచారం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆయనతో పాటు హెడ్కానిస్టేబుల్ రమణ, ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.

Join WhatsApp

Join Now