షీ టీం పై అవగహన కల్పిస్తున్న పోలీసులు
ప్రశ్న ఆయుధం 06 మే ( బాన్సువాడ ప్రతినిధి )
బాన్సువాడ షీ టీం కానిస్టేబుల్స్ అయినా అనిల్ కుమార్ ప్రియాంక బాన్సువాడ నర్సింగ్ కళాశాల నందు విద్యార్థినిలకు డయల్ 100 మరియు షీ టీం,సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పించి అత్యవసర పరిస్థితులలో డయల్ 100 కి కాల్ చేయాలని కాలేజ్ వద్ద గాని బస్టాండ్ల వద్ద గాని బంధువుల వల్ల గాని అసభ్యకరమైన ప్రవర్తన ఎదుర్కొన్నట్లయితే కామారెడ్డి షీ టీం నంబర్ 8712686094 కి కాల్ చేసి తెలిపితే దరఖాస్తు దారిని వివరాలు గోప్యంగా ఉంచి తగు చట్టరీత్యా చర్య తీసుకుంటామని తెలిపారు.సైబర్ నేరాల గూర్చి అవగాహన కల్పించి సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ 1930 కాల్ చేయాలనీ తెలిపారు.