Site icon PRASHNA AYUDHAM

రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యాన్ ను సీజ్ చేసిన పోలీసులు

IMG 20250216 WA0072

*రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యాన్ ను సీజ్ చేసిన పోలీసులు*

కమలాపూర్  ప్రతినిధి ( ఫిబ్రవరి16)

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని అంబాల గ్రామానికి చెందిన బోయిని రాజు అను అతడు ఆదివారం రోజున అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నాడని విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ట్రాలీ వాహనంలో పిడిఎస్ బియ్యాన్ని లోడ్ చేస్తున్న వాహనం నెంబర్ TS02UB9210 అను వ్యాన్ ను సీజ్ చేయడం జరిగింది. రాజు అను వ్యక్తి దగ్గర 28 క్వింటాల రేషన్ బియ్యము ఉన్నట్లు గుర్తించారు. అట్టి బియ్యం విలువ సుమారు లక్ష తొమ్మిది వేల రెండు వందల రూపాయలుగా నిర్ధారించారు, బోయిని రాజు, వాహనాన్ని సిజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఈ.వీరభద్రరావు తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Exit mobile version